Begin typing your search above and press return to search.

ఒక్క లుక్కుతో స‌ముద్రంలోకి తోసేసింది!

By:  Tupaki Desk   |   28 March 2021 6:30 AM GMT
ఒక్క లుక్కుతో స‌ముద్రంలోకి తోసేసింది!
X
సింపుల్ గా న‌వ్వి స‌ముద్రంలోకి తోసేస్తావా అనూ? అలా ఒక్క లుక్కుతోనే స‌ముద్రంలోకి గెంటేస్తే ఎలా? అంత పాపం ఏం చేశామ‌ని!! అంటూ ప్ర‌శ్నిస్తున్నారు బోయ్స్. నిజంగానే ఒక్క లుక్కుతో అగ్గి రాజేసింది అనూ ఇమ్మాన్యుయేల్. నేటిత‌రంలో అందానికి అందం ప్ర‌తిభ ఉండీ ఆశించినంత‌గా రాణించ‌లేక‌పోయిన‌ దుర‌దృష్టవంతురాలు ఈ బ్యూటీ.

మోడ్ర‌న్ లుక్ లో క‌నిపించినా.. కోక ర‌వికెలో క‌నిపించినా అనూ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మంత్ర ముగ్ధులైపోతారు. అంత‌టి స‌మ్మోహ‌నం ఉండీ ఎందుక‌నో టాలీవుడ్ లో ఎద‌గ‌లేక‌పోయింది. బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెప్పుకునేంత‌గా ల‌క్ చిక్క‌లేదు. హిట్టును న‌మ్మే ప‌రిశ్ర‌మ‌లో త‌నుకు ద‌క్క‌నిది ఆ ఒక్క‌టే.

అజ్ఞాత‌వాసి.. నా పేరు సూర్య‌.. శైల‌జారెడ్డి అల్లుడు ఇవ‌న్నీ క్రేజీ ఆఫ‌ర్లు. కానీ అన్నీ డిజాస్ట‌ర్లుగా నిలిచి త‌న కెరీర్ ని ఇబ్బందుల్లో ప‌డేశాయి. అందుకే ఇప్పుడు అజ‌య్ భూప‌తి అయినా త‌న‌కో హిట్టిస్తాడ‌ని అనూ న‌మ్ముతోంది. మ‌హాస‌ముద్రం లాంటి కాన్సెప్ట్ బేస్డ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్ స‌హా పోస్ట‌ర్లు ప్ర‌తిదీ ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి అను ఇమ్మాన్యుయేల్ కొత్త‌ లుక్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. నేడు అనూ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపింది.

సింపుల్ ఫ్లోర‌ల్ టాప్ ధ‌రించి.. స్టైలిష్ గా క‌నిపిస్తోంది. అలా తీరిగ్గా ఏదో కెఫేలో కూచుని టేబుల్ పై చేతిని ఆన్చి సింపుల్ గా స్మైలిస్తోంది. ఒక్క లుక్కుతోనే కుర్ర‌కారు గుండెల్ని సుతారంగా మీటింది. చూస్తుంటే స‌ముద్రంలోకి తోసేసినంత ప‌నే చేసింది మ‌రి!!