Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ని డామినేట్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   8 Nov 2017 7:02 AM GMT
కీర్తి సురేష్ ని డామినేట్ చేస్తుందా?
X
ఈ రోజుల్లో మోడల్స్ నుండి హీరోయిన్స్ గా అయిన భామలు సినిమా సినిమాకు చాలా కొత్తగా కనిపిస్తున్నారని చెప్పాలి. ఫ్యాషన్ ప్ర్రపంచంలో ఎంత అందంగా కనిపించినా అనుకున్నంతగా గుర్తింపు రాకపోవచ్చు కానీ ఒక్కసారి సినిమాలో క్లిక్ అయితే మాస్ థియేటర్స్ నుండి క్లాస్ థియేటర్స్ వరకు హీరోయిన్స్ అందాలకు విజిల్స్ పడుతూనే ఉంటాయి.

ప్రస్తుతం మల్లూ బ్యూటి అను ఇమ్మానుయేల్ కూడా ఆ తరహాలో ఆదరణను దక్కించుకోవాలని తెగ ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు చిన్న సినిమాల్లో కనిపించిన అను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కీర్తి సురేష్ కూడా పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. రీసెంట్ గా చిత్ర దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్బంగా అను ఇమ్మానుయేల్ ఆయనతో దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విషెస్ ని అందించింది.

అయితే ఈ ఫొటోలో అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది. మజ్ను సినిమాలో నార్మల్ గా కనిపించిన అను కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కూడా అదే స్థాయిలో కనిపించింది. కానీ ఇప్పుడు పవన్ సినిమాలో మాత్రం గ్లామర్ డోస్ ని కాస్త ఎక్కువగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇదే లొకేషన్ నుండి కీర్తి సురేష్‌ చేసిన సెల్ఫీకి అంతగా క్రేజ్ రాలేదు. దానిక కారణం అను గ్లామరే అని చెప్పాలి. చూస్తుంటే కీర్తి సురేష్ ని సినిమాలో తన సోయగాలతో డామినేట్ చేసేలా ఉంది. పైగా అను కూడా మంచి యాక్టరే. చూద్దాం ఏమవుతుందో!!