Begin typing your search above and press return to search.

బన్నీ ఇంటికి పవన్ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 July 2017 4:22 AM GMT
బన్నీ ఇంటికి పవన్ హీరోయిన్
X
గతేడాది సరైనోడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ఈ ఏడాది డీజే-దువ్వాడ జగన్నాధం అంటూ ఆసక్తి కలిగించాడు. ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయిన డీజే.. చివరకు యావరేజ్ గా మిగిలింది. చాలా రోజుల తర్వాత తన సినిమాను హిట్ పట్టాలు ఎక్కించలేకపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు తన తర్వాతి మూవీపై దృష్టి పెట్టాడు.

టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు ఉన్న వక్కంతం వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ.. 'నా పేరు సూర్య' అనే టైటిల్ పై రూపొందనున్న మూవీలో నటిస్తున్నాడు బన్నీ. ఈ టైటిల్ కి ట్యాగ్ లైన్.. నా ఇల్లు ఇండియా. ఈ ఇండియా ఇంటిలోకి ఇప్పుడు హీరోయిన్ అను ఇమాన్యుయేల్ వచ్చి చేరింది. ముందు నుంచి అనుకున్నట్లుగా పవన్ హీరోయిన్ కే ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. నానితో మజ్ను చేసిన ఈ భామ.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.

ఈ మలయాళీ కుట్టికి.. నా పేరు సూర్యలో ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. దేశభక్తి జోనర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో.. అను రోల్ కొత్తగా ఉంటుందని.. ప్రస్తుతం ఆ పాత్ర కోసం లుక్ విషయంలో దర్శకుడితో చర్చలు జరుపుతోందని అంటున్నారు. ఆగస్ట్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుండగా.. తొలి షెడ్యూల్ లోనే ప్రధాన నటీనటులతో కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేసేస్తారట. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ మూవీల ప్రధాన పాత్రను పోషించనున్నాడు.