Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సూపర్.. మాలీవుడ్ వేస్ట్ అనేసింది

By:  Tupaki Desk   |   12 Nov 2016 9:21 AM GMT
టాలీవుడ్ సూపర్.. మాలీవుడ్ వేస్ట్ అనేసింది
X
ఆమె ఒక ఎన్నారై మలయాళ భామ.. తన సొంత ఇండస్ట్రీలోనే బాల నటిగా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ అయింది. ఆపై తమిళ.. తెలుగు భాషల్లోనూ అడుగుపెట్టింది. ఐతే ఇప్పుడామె సొంత ఇండస్ట్రీ మీద విమర్శలు గుప్పించి.. టాలీవుడ్.. కోలీవుడ్ మీద ప్రశంసలు కురిపించడం దుమారం రేపుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అను ఇమ్మాన్యుయెల్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె మలయాళ సినీ పరిశ్రమ మీద విమర్శలు చేసింది. ఐతే ఏదో ఆవేశంలో ఆ మాట అనేసిందేమో అనుకుంటే.. ఆ తర్వాత ఇంకో ఇంటర్వ్యూలోనూ ఇదే వ్యాఖ్యలు చేసింది.

ఈ విమర్శలపై ఆమెను కదిపితే.. ‘‘నేను ఫీలైందే చెప్పాను. నేను తెలుగు.. తమిళం.. మలయాళం మూడు భాషల్లోనూ నటించాను. తెలుగులో.. తమిళంలో హీరోయిన్లను బాగా చూసుకుంటారు. ఒక్క మాలీవుడ్లోనే హీరోయిన్లకు తగిన గౌరవం ఇవ్వరు. అందుకే అలా చెప్పాను. మాలీవుడ్ ను బాగా పరిశీలించిన తర్వాతే నేనా విమర్శలు చేశాను’’ అంటూ కుండబద్దలు కొట్టేసింది అను. ఇంకా 20 ఏళ్లు కూడా దాటని ఈ అమ్మడు భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తానని అంటుండటం విశేషం. ‘‘దర్శకత్వం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ అందుకు కొంచెం టైం పడుతుంది. కచ్చితంగా భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తాను’’ అని అను చెప్పింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ ‘ఆక్సిజన్’తో పాటు మరో సినిమాలో నటిస్తున్నానని.. తమిళంలోనూ రెండు సినిమాలు చేతిలో ఉన్నాయని అని వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/