Begin typing your search above and press return to search.

అందం కలబోసి.. అదృష్టం జతచేసి...

By:  Tupaki Desk   |   8 Aug 2017 10:33 AM GMT
అందం కలబోసి.. అదృష్టం జతచేసి...
X
నడుమొంపులో ఉన్నది వయ్యారి వీణ.. ఆ వీణలో రాగాన్నైపోనా... అంటూ ఓ సుందరాంగి జఘన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఓ సినీ కవి గీతాన్ని రాశాడు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కు ఈ మాటలు చక్కగా సరిపోతాయి. కేరళ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ మళయాళీ అందం ఇక్కడి కుర్రాళ్ల గుండెలను బాగానే కొల్లగొట్టింది.

నటన సంగతి ఎలా ఉన్నా తన అప్పియరెన్స్ అండ్ అందచందాలతో మెప్పించడంలో అను ఇమ్మానుయేల్ ఓ అడుగు ముందే ఉంటుంది. మరీ ముఖ్యంగా బుంగమూతి పెట్టి కబుర్లు చెప్పడంలో.. కనిపించీ కనిపించని నడుము ఒంపులను చూపిస్తూ కవ్వించడంలో ఈ సుందరి స్పెషల్. లేత మెరుపుతీగలాంటి ఈ భామ తన స్పెషల్ అట్రాక్షన్ ఏంటో బాగానే గుర్తించింది. అందుకే ఫొటో స్టిల్స్ ఇచ్చేటప్పుడు వయ్యారం ఒలకబోస్తూ చూపులన్నీ నడుం చుట్టూ ఉండేలా చూసుకుంటోంది.

మజ్ను సినిమాతో టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది ఇను ఇమ్మానుయేల్. తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో రాజ్ తరుణ్ పక్కన హీరోయిన్ గా చేసింది. ఈ రెండు సినిమాల్లో అమ్మడి బ్యూటీ చూసి దర్శక - నిర్మాతలు మెస్మరైజ్ అయిపోయారు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అందం పుష్కలంగా ఉంది.. అదృష్టం కలిసొస్తోంది కాబట్టి అవకాశాలు రావడం పెద్ద మేటరేం కాదు.