Begin typing your search above and press return to search.

మూడు ముక్కలాటలో ఎవరి షేర్ ఎంత ?

By:  Tupaki Desk   |   22 Dec 2018 5:50 AM GMT
మూడు ముక్కలాటలో ఎవరి షేర్ ఎంత ?
X
నిన్న ఎన్నో అంచనాల మధ్య రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దండయాత్రకు వచ్చాయి. వీటికి అదనంగా హిందీ నుంచి షారుఖ్ ఖాన్ తన జీరోతో రావడంతో టికెట్ కౌంటర్లు నిన్నంతా కళకళలాడాయి. అయితే విచిత్రంగా దేనికీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాకపోవడం విచిత్రం. డివైడ్ టాక్ లేదా నెగటివ్ తోనే ఇవి కొనసాగుతున్నాయి తప్ప ఒకే దానికి ఓటు వేయడం ఏ సినిమాకు జరగలేదు. అయితే మారి 2 పబ్లిసిటీ విషయంలో పూర్తిగా వెనుకబడిపోవడంతో పాటు ధనుష్ కి ఇమేజ్ లేని కారణంగా పోటీ ప్రధానంగా మూడింటి మధ్యే కనిపించింది.

పడి పడి లేచే మనసు మంచి విజువల్స్ తో పాటు శర్వా-సాయి పల్లవిల ఫ్రెష్ కెమిస్ట్రీ మేజిక్ చేస్తుందనే అనుకున్నారు అందరు. అయితే సెకండ్ హాఫ్ మీద వ్యక్తమవుతున్న విపరీత అభిప్రాయాలు ఫైనల్ గా రన్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ గా వచ్చిన వరుణ్ తేజ్ అంతరిక్షం సైతం పూర్తిగా మంచి టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. అరుదైన ప్రయత్నమే అయినప్పటికీ సామాన్యుడికి అర్థం అయ్యేలా సినిమాను చూపించడంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతగా సక్సెస్ కాలేకపోయాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కన్నడ నుంచి డబ్ అయిన భారీ మూవీ కెజిఎఫ్ లో యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో రెస్పాన్స్ కొంత బాగున్నా అసలైన కథా కథనాలు గ్రిప్పింగ్ లేవనే కామెంట్ తో ఇది కూడా అటు ఇటుగా ఊగుతోంది.

అయితే రేస్ లో ప్రధానంగా నిలిచిన ఈ మూడు సినిమాల్లో ఏది ఎక్కువ రాబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఆగస్ట్ 11న ఇదే తరహా సిచువేషన్ వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి-జయ జానకి నాయక-లై మూడు ఒకేరోజు వచ్చి ఓమాదిరి టాక్ తెచ్చుకున్నా వసూళ్ల పరంగా అద్భుతాలు చేయలేకపోయాయి. అలాంటిది డివైడ్ టాక్ వచ్చిన ఈ మూడు ఏ మేరకు నిలదొక్కుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి క్లారిటీ రావాలంటే కనీసం వీకెండ్ పూర్తి చేసుకుని బుధవారం దాకా ఆగాలి.