Begin typing your search above and press return to search.

'అంటే సుందరానికి' షూటింగ్ పూర్తి

By:  Tupaki Desk   |   24 Jan 2022 2:50 AM GMT
అంటే సుందరానికి షూటింగ్ పూర్తి
X
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని రోమ్-కామ్ `అంటే సుందరానికి` వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ``ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. #అంటే సుందరానికి`` అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన‌ది ఒక చిన్న వీడియోను కూడా పంచుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా అంటే సుందరానికి ఫస్ట్ లుక్ విడుదలైంది. నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది సినిమాలో అతని పాత్ర పేరు. అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి కెమెరా వ‌ర్క్ అందిస్తున్నారు.

నదియా- హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ- సుహాస్ తదితరులు న‌టిస్తున్నారు. నవీన్ యెర్నేని & రవిశంకర్ వై నిర్మాత‌లు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.