Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతుళ్ళను అంటే ఊరుకోను

By:  Tupaki Desk   |   5 March 2018 10:11 AM GMT
శ్రీదేవి కూతుళ్ళను అంటే ఊరుకోను
X
శ్రీదేవి కాలం చేసాక, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక కూడా బోనీ కపూర్ ను ఒదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. తన పరిస్థితే అలా ఉంటే అమ్మ తప్ప ఇంకే లోకం తెలియని జాన్వీ, ఖుషిల సంగతి చెప్పనక్కర్లేదు. దేశం మొత్తం కుదిపేసిన శ్రీదేవి అకాల మరణం ఆ కుటుంబంలో మాత్రం అంతులేని విషాదం మిగిలించింది. ఇప్పుడు బోనీ మీద నలుగురు పిల్లల బాధ్యత ఉంది. మొదటి భార్య కలిగిన సంతానం అర్జున్, అన్శులా ప్లస్ శ్రీదేవి పిల్లలు జాన్వీ, ఖుషి. ఇందులో ఎవరు పూర్తి స్థాయిలో ఇంకా సెటిల్ కానే లేదు. ఇక పెళ్ళిళ్ళ గురించి అప్పుడే ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. పుట్టెడు శోకం నుంచి బయటికి రావడానికి తీవ్రంగా కష్టపడుతున్న బోనీ కపూర్ పిల్లలు తనకు ఎంత అండగా నిలిచారో లేఖ ద్వారా వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే.

ఇది మనం చూస్తున్న వర్తమానం. గతం వేరు. అర్జున్, అన్శులాకు శ్రీదేవి బిడ్డలకు మధ్య పెద్ద గ్యాపే ఉండేది. తమ తల్లికి తండ్రిని దూరం చేసిన వ్యక్తిగా శ్రీదేవితో ఆ ఇద్దరు దూరం మైంటైన్ చేస్తూ ఉంటారు. బోనీ ఎంత ప్రయత్నించినా ఈ నలుగురిని ఒక్కటి చేయలేకపోయారని బాలీవుడ్ మీడియాలో చాల సార్లు కథనాలు వచ్చాయి. అర్జున్ కపూర్ శ్రీదేవి పేరు పలకడానికి కూడా ఇష్టపడేవాడు కాదనే సంగతి కొన్ని ఇంటర్వ్యూలలో గమనించవచ్చు. అన్శులా సంగతి సరేసరి. శ్రీదేవి బ్రతికుండగా కాదు కాని తను పోయాక సవితి పిల్లలను తన బిడ్డలకు దగ్గర చేసింది. అర్జున్ కపూర్ మొదటి రోజు నుంచి తండ్రితో పాటు జాన్వీ-ఖుషిలకు అండగా ఉండే ప్రయత్నం చేసాడు.

తాజగా అన్శులా కూడా తన చెల్లెళ్ళకు ఆన్ లైన్ లో బహిరంగంగా మద్దతు తెలిపింది. ఒక అభిమాని జాన్వీ-ఖుషి లకు వ్యతిరేకంగా అన్షుల ఎకౌంటులో ఒక ట్వీట్ చేయటంతో దాన్ని సీరియస్ గా తీసుకున్న అన్షుల సదరు ఫ్యాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. తన చెల్లెళ్ళను ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకోనని చెబుతూ ఆ వ్యక్తి చేసిన మెసేజ్ ని డిలీట్ చేసేసింది. తమ మీద ప్రేమకు సంతోషమే కాని వాళ్ళను అంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసింది. ఏదైతేనేం నలుగురు కలిసిపోయారు. జూన్ లో విడుదల కానున్న జాన్వీ మొదటి సినిమా ధడక్ ను శ్రీదేవికి అంకితమిస్తూ గ్రాండ్ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నాడు కరణ్ జోహార్. కపూర్ కుటుంబంతో సహా బాలీవుడ్ తారాలోకం మొత్తం తరలివచ్చేలా ఆ షో వేయబోతున్నారు.