Begin typing your search above and press return to search.
మిస్సింగ్ బ్యూటీ ఇలా షాకిచ్చిందేమిటి?
By: Tupaki Desk | 26 May 2020 4:30 AMకింగ్ నాగార్జున సరసన `మన్మథుడు` చిత్రంలో నటించింది అన్షు. మన్మథుడి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అన్షు ఇచ్చిన ట్రీట్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందానికి అందం ఒడ్డు పొడుగు ఉన్న ఈ అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయిపోని ఆడియెన్ లేరు. సోనాలి బింద్రే ఉన్నా అన్షుకే ఎక్కువ ఫాలోయింగ్ కనిపించింది. ఆ సినిమా తర్వాత అన్షు పెద్ద స్టార్ అయిపోతుందనే అంతా భావించారు.
అయితే ... అనూహ్యంగా ఒకట్రెండ్ సినిమాలకే అన్షు పరిమితమైంది. నాగార్జున మన్మథుడు తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర చిత్రంలో నటించింది. ఆ రెండు సినిమాలతో పాటు పలు కన్నడ సినిమాల్లో నటించింది. అయితే అన్షు టాలీవుడ్ లో మిస్సవ్వడానికి కారణం ఒక స్టార్ హీరో అని కూడా ప్రచారమైంది. అతడు దాచేయడం వల్లనే కథానాయికగా అవకాశాలొచ్చినా అన్షు కనిపించలేదని అభిమానులు భావించారు.
అయితే అది నిజమా? అంటే కేవలం గాసిప్ మాత్రమే. అన్షు అప్పుడు మిస్సయ్యి ఎక్కడికి వెళ్లింది? అన్న ఆరాలు తీసినా మొన్నటి వరకూ సరైన సమాచారం అయితే లేదు. అయితే తాజాగా అన్షు క్లూ ఒకటి దొరికింది. అన్షు ఫ్యామిలీ ఫోటో ఒకటి తాజాగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. తనకు భర్త.. ఒక కిడ్ ఉన్నారు. అన్షు లండన్ (యూకే)లో ఉంటున్నారు. అక్కడే భర్త కుటుంబంతో సెటిలయ్యారు. బిజినెస్ మేన్ సచిన్ సగ్గార్ ని అన్షు వివాహం చేసుకున్నారు. వీరికి ఆడబిడ్డ జన్మించింది. అన్షు ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా అక్కడ సొంతంగా `ఇన్‌స్పిరేషన్ కౌచర్` అనే డిజైనింగ్ షాప్ ని రన్ చేస్తున్నారట. బాలీవుడ్ సహా సౌత్ స్టార్ల డిజైన్లకు డూప్లికేట్ పీస్ లు వీటిలో లభ్యమవుతాయని తెలుస్తోంది.
ఇక అన్షు అంబానీ అనేది తన పూర్తి పేరు. అంబానీ ఇంటి పేరే అయినా.. అనూహ్యంగా నటనా రంగంలో అడుగు పెట్టి.. అటుపై చదువుల నిమిత్తం సైలెంట్ గా లండన్ వెళ్లిపోయింది. అక్కడ చదువు పూర్తి చేసుకుని అటుపై పెళ్లాడి హాయిగా కాపురం చేసుకుంటోందన్నమాట. అయితే చేసింది రెండు మూడు సినిమాలే అయినా గొప్ప నటి అన్న పేరు తెచ్చుకుని యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఉన్నట్టుండి ఇండస్ట్రీని వదిలేయడంతో అదో ఫజిల్ లా భావించారు అంతా. నాగార్జున- విజయ్ భాస్కర్- త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మన్మథుడు రిలీజై ఇప్పటికే 18 సంవత్సరాలు అయ్యింది.