Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ గా బాలయ్య.. మరి ఏఎన్నార్?

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:19 AM GMT
ఎన్టీఆర్ గా బాలయ్య.. మరి ఏఎన్నార్?
X
నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా చేస్తానని.. అందులో ఎన్టీఆర్ గా తానే నటించబోతున్నానని బాలకృష్ణ ఇప్పటికే అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. స్క్రిప్ట్ కు సంబంధించిన మాటామంతీ కూడా జరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు దర్శకుడు ఎవరనే విషయంపై కూడా కొత్తకొత్త ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే.. ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ అంటే ఆయన సినిమా ప్రస్థానంతోనే కథ కీలక దశకు చేరుకుంటుంది. మరి ఎన్టీఆర్ సమకాలికుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు పాత్ర మూవీల ఉండడం కంపల్సరీ. ఎందుకంటే.. వీరిద్దరు కలిసి సినిమాలు చేయడమే కాదు.. మంచి సన్నిహితులు కూడా. పోటాపోటీగా సినిమాలు చేసినా స్నేహపూర్వకంగా వారిద్దరూ ఉండేవారు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర లేని ఎన్టీఆర్ మూవీ అసాధ్యం అనే చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. మరి ఏఎన్నార్ పాత్రను ఎవరు చేస్తారనే?

ఎన్టీఆర్ పాత్రను ఆయన వారసుడు బాలయ్య చేస్తున్నారు కాబట్టి.. ఏఎన్నాఆర్ రోల్ ను నాగార్జున చేస్తేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్. మరి ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా.. నందమూరి-అక్కినేని వారసుల మల్టీ స్టారర్ సాధ్యమవుతుందా అనే విషయమే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ అయిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/