Begin typing your search above and press return to search.
‘సంజనా బెయిల్’ మరో ట్విస్ట్
By: Tupaki Desk | 8 Dec 2020 1:47 PM ISTతనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్తమా ఉందని.. ఈ చలికాలంలో అది మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలని సంజనా గల్రానీ కోర్టును అభ్యర్థించారు. కన్నడ నటి సంజన డ్రగ్స్‌కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె విచారణ ఖైదీగా ఉన్నారు. సంజనా ఇప్పటికే బెయిల్ కోసం రెండు సార్లు పిటిషన్‌ను దాఖలు చేశారు. కానీ ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే తాజగా కోర్టు మాత్రం సంజనకు ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. వాణి విలాస్ వైద్యశాలలో ఆమెకు పరీక్షలు నిర్వహించాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.
ఒక వేళ వైద్యుల రిపోర్ట్‌లో ఆమెకు అనారోగ్యం ఉన్నట్టు తేలితే బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉన్నది. గురువారం లోపు వైద్యపరీక్షలకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కూడా జస్టిస్ శ్రీనివాస్ హరీశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో డ్రగ్స్‌కేసు పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. సంజనా ఇంట్లో ఎన్సీబీ అధికారులకు డ్రగ్స్ దొరికింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆధారాలు బలంగా ఉండటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో ప్రముఖ సినిమా హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్ల పేర్లు కూడా వినిపించినప్పటికి వాళ్ల పేర్లు బయటకు రాలేదు. అయితే సంజన మాత్రం అరెస్టయిన నాటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని.. కొందరు కుట్రపూరితంగా తనను ఇరికించారని ఆమె చెబుతున్నారు. అయితే నిజానిజాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.