Begin typing your search above and press return to search.

చ‌నిపోయిన‌ ద‌ర్శ‌కుడి ఇంట్లో మ‌రో విషాదం..!

By:  Tupaki Desk   |   18 March 2021 4:00 PM IST
చ‌నిపోయిన‌ ద‌ర్శ‌కుడి ఇంట్లో మ‌రో విషాదం..!
X
కోలీవుడ్ లో సామాజిక బాధ్య‌త‌తో సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు ఎస్‌.పి.జ‌న‌నాథ‌న్ ఇటీవ‌లే బ్రెయిన్ స్ట్రోక్ తో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల‌పాటు ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొంది ఈ నెల 14వ తేదీన తుదిశ్వాస విడిచారు.

అయితే.. ఆయ‌న చ‌నిపోయిన మూడో రోజునే మ‌రో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న సోద‌రి ల‌క్ష్మీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. సోద‌రుడు జ‌న‌నాథ‌న్ అంత్య‌క్రియ‌ల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే.. సోద‌రుడి మృతిని త‌ట్టుకోలేక ఆమె గుండెల‌విసేలా రోదిం‌చారు. ఈ ఆవేద‌న‌తోనే ఆమె గుండెపోటుతో చ‌నిపోయి ఉంటార‌ని భావిస్తున్నారు. దీంతో.. వారి కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది.

కాగా.. జ‌న‌నా‌థన్ ఈ మ‌ధ్య‌నే 'లాభం' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, శృతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఆ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉండ‌గానే ఆయ‌న చ‌నిపోయారు.

కాగా.. జ‌న‌నాథ‌న్ కు, విజ‌య్ సేతుప‌తికి ఎంతో కాలంగా అనుబంధం ఉంది. సేత‌ప‌తి క‌ష్ట‌కాలంలో ఉన్న స‌మ‌యంలో జ‌న‌నాథ‌న్ ఆదుకున్నారు. అలాంటి వ్య‌క్తి చ‌నిపోయిన విష‌యం తెలుసుకున్న సేతుప‌తి.. వెంట‌నే చేరుకుని, ఆయ‌న ‌భౌతిక కాయాన్ని వాళ్ల ఇంటికి తెచ్చే వ‌ర‌కూ వెంటే ఉన్నారు. ఆ త‌ర్వాత కూడా క‌న్నీళ్ల‌తో అంతిమ యాత్ర‌లో ఓ సాధార‌ణ వ్య‌క్తిగా పాల్గొన్నారు. ద‌హ‌న‌ సంస్కారాలు పూర్తిచేసే వ‌ర‌కూ అక్క‌డే ఉన్నారు.