Begin typing your search above and press return to search.

నిర్మాతగా మారనున్న మరో టాప్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   14 April 2020 5:00 AM IST
నిర్మాతగా మారనున్న మరో టాప్ డైరెక్టర్!
X
టాలీవుడ్ టాప్ దర్శకుడిగా ఒక వైపు వరుస హిట్లు కొడుతూనే, మరో వైపున నిర్మాతగాను సుకుమార్ విజయాలను అందుకుంటున్నాడు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అసిస్టెంట్లను, తను నిర్మించే సినిమాల ద్వారా దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ బాటలోనే మరో టాప్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కూడా నడవనున్నాడనే టాక్ ఒకటి ఫిల్మ్ నగర్ లో బలంగా వినిపిస్తోంది. సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించాలని చూస్తున్నారట.

కొరటాల నిర్మాతగా మారనున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తున్న విషయం తెలిసిందే. తన దగ్గర చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్ కి దర్శకత్వ బాధ్యతను అప్పగించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మాటలను ఆయనే సమకూర్చనున్నట్టు చెబుతున్నారు. నిజానికి కొరటాల శివ రచయితగా వందల కథలను రాసాడట. అయితే వాటినే తెరమీదకి తీసుకురావాలని భావిస్తున్నాడట. లాక్ డౌన్ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం. కొరటాల తాజా చిత్రంగా 'ఆచార్య' సెట్స్ పై వున్న సంగతి తెలిసిందే.