Begin typing your search above and press return to search.
మరో టాలీవుడ్ డైరెక్టర్.. బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడా??
By: Tupaki Desk | 29 Dec 2020 12:00 PM ISTటాలీవుడ్ హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా వరుసగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించి హిట్స్ అందుకుంటున్నారు. ఇదివరకే కొంతమంది డైరెక్టర్లు బాలీవుడ్ లో కూడా హిట్టు కొట్టగలమని నిరూపించడంతో కొత్తగా టాలీవుడ్ డైరెక్టర్లలో ధైర్యం వస్తోంది. ఇక గతేడాది అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే కోవలో జెర్సీ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకొని అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అది ఆల్రెడీ హిట్ స్టోరీ కాబట్టి బాలీవుడ్ లో కూడా గౌతమ్ సక్సెస్ కొడతాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ నుండి మరో డైరెక్టర్ బాలీవుడ్ బాట పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు డైరెక్టర్ మారుతీ. ఆయన చేసిన హిట్ సినిమాలు ఆల్రెడీ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. కానీ డైరెక్టర్ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే ఈరోజుల్లో ఎవరి హిట్ సినిమాలను వారే వేరే భాషలో రీమేక్ చేస్తున్నారు. మరి డైరెక్టర్ మారుతీ సినిమాలను వేరే వాళ్ళు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కానీ మారుతీ నుండి ఎలాంటి బాలీవుడ్ న్యూస్ బయటికి రాలేదు. అయితే మారుతీ ఇదివరకే బాలీవుడ్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఎప్పుడు.. ఏ సినిమా అనేది చెప్పలేదు. ఈ మధ్య బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నారు. పిలిచి మరీ కథలు వింటున్నారు. మరి మారుతి కూడా స్క్రిప్ట్ పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ ఎంట్రీ ఏమోగానీ తెలుగులో మాత్రం మంచి సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే గోపీచంద్ తో ఒక మూవీ ఓకే అయినట్లు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి మారుతీ ఎలాంటి కబురు వినిపిస్తాడో..!!