Begin typing your search above and press return to search.
మెలోడీ బ్రహ్మకు మరో అదిరి పోయే చాన్స్!
By: Tupaki Desk | 30 Aug 2020 11:00 AM ISTమెలోడీ బ్రహ్మ మణిశర్మ అదరగొడుతున్నాడు. వరుస బెట్టి అగ్ర హీరోల సినిమాలను పట్టేస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీకి సంగీతం అందిస్తున్న మణిశర్మ మరో బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. అల్లు అర్జున్ - కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీకి కూడా సంగీతం అందించనున్నాడు. మణిశర్మ 90స్ లో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన బాణీలే ప్రత్యేకం. ఎక్కువగా ఆయన స్టార్ హీరోల సినిమాలకే పని చేశాడు. అదిరి పోయే మాస్, ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇవ్వడంలో ప్రత్యేకత చూపేవాడు. ఇక మెలోడీలు అయితే ఇరగ దీ సేవాడు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ ఇలా అగ్ర కథానాయకులు అందరికీ మణిశర్మ మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఖుషి సినిమాల్లో పాటలు ఎంత హిట్టో.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే హిట్టు. ఒక వెలుగు వెలిగిన మణిశర్మకు పదేళ్ల పాటు సరైన అవకాశాలు దక్కలేదు. గత ఏడాది పూరీ - రామ్ ల ఇస్మార్ట్ శంకర్ మూవీ మణిశర్మ లైఫ్ ని మరో సారి టర్న్ చేసింది. ఆ సినిమాలో ఊర మాస్ సాంగ్స్ జనానికి నచ్చేశాయి. ఆ తర్వాత మణిశర్మకు ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి తన ఆచార్య మూవీకి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాకు మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్ నచ్చడంతో అల్లు అర్జున్ తో తన తదుపరి ప్రాజెక్టుకు కూడా కొరటాల మణినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో మణిశర్మకు ఇది మూడో సినిమా. ఇదివరకు పరుగు, వరుడు సినిమాలకు సంగీతం అందించాడు. రీ ఎంట్రీలో అదరగొడుతున్న మెలోడీ బ్రహ్మ అల్లు అర్జున్ మూవీకి ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.
