Begin typing your search above and press return to search.
తనకూ జాక్ పాట్ తగులుతుందనే కలిసాడా?
By: Tupaki Desk | 11 March 2020 11:15 AM ISTవరుసగా వెటరన్స్ అంతా పవన్ ని కలిసి కథలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇదో కొత్త పరిణామం. ఇంతకీ ఏమిటా కొత్త వార్త అంటారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన `తొలిప్రేమ` అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభంలో నటించిన ఆ చిత్రం పవన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ను.. ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఆ సక్సెస్ పవన్ కు ఎంతో ఉపయోగపడింది. ఆ విజయంతోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అన్న ఇమేజ్ నుంచి బయటకు రాగలిగాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. అటుపై తమ్ముడు..బద్రి.. ఖుషీ లాంటి సక్సెస్ లతో పవన్ పెద్ద స్టార్ అయిన వైనం గురించి తెలిసిందే.
తొలి ప్రేమ కాంబినేషన్ లోనే `బాలు` అనే సినిమా చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా అంచనాలను అందుకో లేకపోయింది. తర్వాత ఆ జోడీ మరోసారి చేతులు కలపలేదు. అయితే పవన్ సహజంగా ఒకసారి పనిచేసిన దర్శకుడితో మళ్లీ కలిసి సినిమాలు చేయడం చాలా రేర్. త్రివిక్రమ్.. ఎస్.జె సూర్య.. కరుణకరన్ ని మాత్రమే అలా రిపీట్ చేసాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పవన్ తన 28వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఆ జాబితాలో హరీష్ పేరు కూడా చేరింది.
తాజాగా మరోసారి కరుణాకరన్.. పవన్ తో సినిమా చేయడానికి ప్రయత్నస్తున్నాడని ప్రచారమవుతోంది. పవన్ కి మరో మంచి లవ్ స్టోరీ ని డైరెక్ట్ చేయడానికి కరుణాకరన్ పావులు కదుపుతున్నాడుట. ఈ నేపథ్యం లో ఇటీవలే జనసేన ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ని కలిసారని ప్రచారమవుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అన్నది తెలీదు కానీ..ప్రచారం మాత్రం వేడెక్కిస్తోంది. 50కి చేరువవుతున్న పవన్ తో ఈ వయసులో లవ్ స్టోరీ ఏంటి? అన్న కామెంట్లు అతడి పై పడుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తాడా? అన్నది అభిమానుల ప్రశ్న. కొన్నేళ్లుగా కరుణాకరన్ కి సక్సెస్ అందని ద్రాక్ష అయింది. చేసినా సినిమాలేవి కలిసి రావడం లేదు. మరి ఇలాంటి సమయంలో పవన్ ఛాన్స్ ఇచ్చి అందుకుంటాడా? అన్నది చూడాలి. తనకూ జాక్ పాట్ తగుల్తుందని ఆశ పడడం తప్పు కాదు కానీ.. మరి పవన్ రెస్పాన్స్ ఎలా ఉందో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.