Begin typing your search above and press return to search.

మరో తమిళ స్టార్‌ ను టాలీవుడ్‌ కు దించబోతున్నారు

By:  Tupaki Desk   |   12 July 2021 8:32 AM GMT
మరో తమిళ స్టార్‌ ను టాలీవుడ్‌ కు దించబోతున్నారు
X
ఈమద్య కాలంలో పలువురు తమిళ స్టార్‌ హీరోలు మరియు దర్శకులు తెలుగు లో సినిమా లు చేస్తున్నారు. శంకర్‌.. లింగు స్వామితో పాటు మరి కొందరు తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలు చేస్తుంటే.. తమిళ హీరోలు విజయ్‌.. ధనుష్‌ లు ఇప్పటికే తెలుగు సినిమాలు ప్రకటించారు. ఇంకా కొందరు తమిళ హీరోలు కూడా తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. తాజాగా తమిళ యువ నటుడు శివ కార్తికేయన్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.

జాతి రత్నాలు సినిమా తో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న అను దీప్ రెండవ సినిమా లో శివ కార్తికేయన్‌ హీరోగా నటించబోతున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన చర్చలు దాదాపుగా ముగింపు దశకు వచ్చాయట. ఈ సినిమా ను ఏషియన్ అధినేత సునీల్ నారంగ్‌ నిర్మించబోతున్నాడు. ఈయన ఇటీవల కాలంలో వరుసగా పెద్ద సినిమాలను నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే ఈయన నుండి మరో సినిమా గా శివ కార్తికేయన్ హీరోగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అనుదీప్ దర్శకత్వంలో జాతి రత్నాలు సినిమా కు సీక్వెల్‌ వర్క్‌ జరుగుతోంది అంటూ వార్తలు వస్తున్న సమయంలోనే అనూహ్యంగా శివ కార్తికేయన్‌ దర్శకత్వంలో సినిమా అంటూ వార్తలు రావడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది. అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ సినిమాను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఊహించలేదు. అనుదీప్‌ రెండవ సినిమా తోనే పాన్‌ ఇండియా సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరో పక్కా ఎంటర్‌ టైనర్‌ కథను రెడీ చేసిన ఈయన శివ కార్తికేయన్‌ ను ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా అధికారిక ప్రకటన రాబోతుంది. శివ కార్తికేయన్‌ తమిళంలో ఏడాదికి మూడు నాలుగు అంతకు మించి సినిమాలను చేస్తూ ఉన్నాడు. కోలీవుడ్‌ లో అంత బిజీగా ఉన్న ఈ హీరో తన మార్కెట్ ను మరింతగా విస్కరించేందుకు గాను తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోకుండా ఓకే చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌ ను వెంటనే మొదలు పెడతారా లేదంటే కాస్త సమయం తీసుకుంటారా అనేది చూడాలి. అనుదీప్ దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకులు ఓ రేంజ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఆశిస్తున్నారు. కనుక ఆయన ఆ రేంజ్ లోనే సినిమాను తెరకెక్కించాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ లో స్క్రిప్ట్‌ ను రెడీ చేశారా అనేది చూడాలి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ కాంబో లో మూవీని కేవలం తెలుగు మరియు తమిళంలో మాత్రమే కాకుండా హిందీ మరియు మలయాళంలో కూడా విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో హీరోయిన్‌ గా ఒక స్టార్ హీరోయిన్‌ నటించబోతుందట. శివ కార్తికేయన్‌ మరియు అనుదీప్‌ ల మూవీ వార్తలపై ఇంకా కొందను అనుమానంగానే ఉన్నారు. వారందరి అనుమానాలు పటా పంచలు అవ్వాలంటే సినిమా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనుదీప్ జాతి రత్నాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించి సినిమాల జాబితాలో టాప్ లో కూడా ఈ సినిమా నిలిచింది. అంతటి విజయం తర్వాత అనుదీప్ తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడం వల్ల మరింతగా అంచనాలు ఉంటాయి. మరి అంచనాలను అనుదీప్‌ అందుకుంటాడా చూడాలి.