Begin typing your search above and press return to search.

'రౌద్రం రణం రుధిరం'లో మరో సూపర్ స్టార్..?

By:  Tupaki Desk   |   27 March 2020 6:30 AM GMT
రౌద్రం రణం రుధిరంలో మరో సూపర్ స్టార్..?
X
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్..ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఉగాది సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. 'రౌద్రం రణం రుధిరం' అనే ఆఫిసిఅల్ టైటిల్ తో ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కి విశేష స్పందన లభిస్తున్నది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్స్ రద్దు చేసుకొని చిత్ర యూనిట్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో వార్తా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రంలో మరో పెద్ద స్టార్ నటించబోతున్నాడని సమాచారం.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి మోహన్ లాల్ కు స్టోరీ చెప్పాడట. మోహన్ లాల్ కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తి కనబరిచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళకి మోహన్ లాల్ కూడా తోడైతే సినిమాకు బాగా ప్లస్ అవుద్దని రాజమౌళి భావిస్తున్నాడట. ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.