Begin typing your search above and press return to search.

నయన్ ని ఫాలో అవనున్న మరో స్టార్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   29 Sept 2020 2:40 PM IST
నయన్ ని ఫాలో అవనున్న మరో స్టార్ హీరోయిన్...?
X
ఒక సినిమాని ఎన్నో వ్యయ ప్రయాసలు పడి రూపొందించినప్పటికీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అందుకే మేకర్స్ నటీనటులతో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా చేయాలనే కండిషన్ పెడతారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం షూటింగ్ కి సపోర్ట్ చేసినా సినిమా ప్రమోషన్స్ ను పట్టించుకోరు. వారిలో ముందుగా స్టార్ హీరోయిన్ నయనతార గురించి చెప్పుకోవాలి. ఈ మలయాళ బ్యూటీ సినిమా కాంట్రాక్ట్ సైన్ చేసే స‌మ‌యంలోనే సినిమా ప్రమోషన్స్ కి రాలేనని ఖరాకండిగా చెప్పేస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీనికి తనకున్న పర్సనల్ విషయాలనే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటారు. ఇప్పుడు మరో సౌత్ స్టార్ హీరోయిన్ కూడా నయన్ ని ఫాలో అవనుందని తెలుస్తోంది.

కాగా, ఇటీవల అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరోయిన్ ఇకపై అగ్రిమెంట్ లో కొత్త రూల్ యాడ్ చేయనుందట. సినిమా షూటింగ్స్ కి మాత్రమే వస్తానని.. ప్రమోషన్ కోసం మీడియా ముందుకు రానని చెప్పనుందట. ఈ మధ్య తనపై వచ్చిన అభియోగాలతో కొన్నాళ్ళు మీడియాకి దూరంగా ఉండ‌టానికి ఫిక్స్ అయింద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల‌తో పాటు.. చేయ‌బోయే సినిమాల‌ విషయంలో కూడా రూల్స్ పెట్ట‌డానికి సిద్ధం అవుతుంద‌ని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఆ వివాదంలో నిజానిజాలు వెల్లడయ్యే వరకు మీడియాకు దూరంగా ఉంటేనే మంచిందని ఆమెకు శ్రేయాభిలాషులు సూచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై చిత్ర నిర్మాతలకు సంకేతాలు కూడా ఇస్తోందని సమాచారం.