Begin typing your search above and press return to search.

నట‌వార‌స‌త్వం కార్చిచ్చులో స్టార్ హీరో పుత్ర‌ర‌త్నం ఎంట్రీనా?

By:  Tupaki Desk   |   18 Oct 2020 10:20 AM IST
నట‌వార‌స‌త్వం కార్చిచ్చులో స్టార్ హీరో పుత్ర‌ర‌త్నం ఎంట్రీనా?
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌స‌త్వం(నెపోటిజం)పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. న‌ట‌వార‌సుల్ని కాపాడేందుకు ఇన్ సైడ‌ర్స్ ని ఉద్ధ‌రించేందుకు ఒక సెక్ష‌న్ బాలీవుడ్ మాఫియా ఔట్ సైడ‌ర్ ప్ర‌తిభ‌ను తొక్కేస్తోంద‌న్న తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌రం దీనిపై అసాధార‌ణ‌మైన డిబేట్ సాగింది.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడన్న వార్త హీట్ పెంచుతోంది. జునైద్ ఖాన్ మలయాళ చిత్రం ఇష్క్ హిందీ రీమేక్ లో న‌టించ‌నున్నార‌ని సమాచారం.

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ పెద్ద కుమారుడు జునైద్ తన బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎలాంటి అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌డం లేదు. జర్మన్ నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెచ్ట్ నాటకం `మదర్ కరేజ్ అండ్ హర్ చిల్డ్రన్` .. క్వాసర్ ఠాకూర్ `ప‌దంసీ` నాట‌కంతో తన థియేటర్ వృత్తిలోకి అడుగుపెట్టిన జునైద్,... గత మూడేళ్లుగా థియేటర్ డ్రామాలో న‌టుడిగా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు.

లాస్ ఏంజిల్స్ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థి గానూ అత‌డి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎ ఫార్మింగ్ స్టోరీ,... ఎ ఫ్యూ గుడ్ గుడ్ మెన్,... మెడియా...బోన్ ఆఫ్ కన్‌టెన్షన్ వంటి ప్ర‌ఖ్యాత నాటకాల్లో జునైద్ న‌టించాడు. ఇంత శిక్ష‌ణ అనంత‌రం జునైద్ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమ‌వుతున్నాడు. మలయాళ చిత్రం ఇష్క్ హిందీ రీమేక్‌లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఇందు‌లో షేన్ నిగమ్- ఆన్ షీటల్ నటించారు. హిందీ రీమేక్ ‌ను నీరజ్ పాండే తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. నట‌వార‌స‌త్వం కార్చిచ్చులో స్టార్ హీరో పుత్ర‌ర‌త్నం ఎంట్రీనా? అంటూ అప్పుడే ఒక సెక్ష‌న్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.