Begin typing your search above and press return to search.
మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ షురూ
By: Tupaki Desk | 11 Aug 2021 6:00 PM ISTమలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన సినిమాలకు కేరళలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆయన ప్రతి సినిమా కూడా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈమద్య కాలంలో పృథ్వీరాజ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అయితే థియేటర్లు లేని కారణంగా ఓటీటీ రిలీజ్ కు పృథ్వీరాజ్ సినిమాలు రెడీ అవుతున్నాయి. పృథ్వీరాజ్ సినిమాలు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉన్నాయి. తాజాగా మరో సినిమాను ఓటీటీ లో పృథ్వీరాజ్ తీసుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన 'కురుతి' నేడు ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతోంది.
కురుతి కి ఉన్న బజ్ నేపథ్యంలో అమెజాన్ వారు భారీ మొత్తంలో చెల్లించి మరీ డైరెక్టర్ రిలీజ్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట. సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను కూడా వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లుగానే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఐఎండీవీలో ఈ సినిమా 8.1 రేటింగ్ ను దక్కించుకుంది.
మను వారియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీలక పాత్రల్లో రోషన్ మాత్వే.. మురళి గోపీలు నటించారు. జాక్స్ బేజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు పడుతున్నాయి. మొత్తానికి కేరళ సినీ ప్రియుల కోసం మరో సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా మళ్లీ మళ్లీ థియేటర్లు మూస్తూనే ఉన్నారు. కనుక పలు సినిమాలు ఓటీటీ రిలీజ్ కు తప్పడం లేదు.