Begin typing your search above and press return to search.

కరోనా బారిన పడిన మరో స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   16 Dec 2021 7:00 PM IST
కరోనా బారిన పడిన మరో స్టార్ హీరో!
X
కరోనా అనే మాటను ఎవరూ కూడా కలలో కూడా మరచిపోలేక పోతున్నారు .. ఆ మాట వింటేనే ఉలిక్కిపడుతున్నారు. ముట్టుకుంటే అంటుకుంటుంది అనే నానుడిలా కరోనా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. విచిత్రమేమిటంటే ఎవరి ద్వారా వచ్చి ఉంటుందనేది ఆలోచన చేస్తే ఎవరికీ ఏమీ అంతుపట్టడం లేదు. ఆ విషయంలో అందరూ ఆయోమయానికి లోను కావలసిందే. దానికి ఎవరి స్టేటస్ లతో పనిలేదు .. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దాడి చేయడమే దాని ప్రధాన లక్షణమైపోయింది. సెలబ్రటీలు కూడా దాని బారిన పడుతూనే ఉన్నారు.

ఇటీవలే ఫారిన్ వెళ్లిన కమల్ అక్కడి నుంచి కరోనా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ నిదానంగా కోలుకున్నారు. ఇక ఇప్పుడు హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా జ్వరం - తలనొప్పి ఉండటంతో అనుమానం వచ్చి టెస్టు చేయించుకోగా, పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
హాస్పిటల్ నుంచి వచ్చిన ఇద్దరికి వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్ అనుమానాల నేపథ్యంలో అందుకు సంబంధించిన టెస్టులు కూడా జరుగుతున్నాయి.

విక్రమ్ ఎవరిని ఎక్కడ కలిసి ఉంటారు అనే విషయంలో అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎందుకంటే ఆయన ఒకటి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలాగే ఆ సినిమాలకి సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నారు. రీసెంట్ గా ఒక యాడ్ ఫిల్మ్ లో కూడా నటించారు. దాంతో ఎక్కడ ఎవరి ద్వారా వచ్చిందనేది తెలియని పరిస్థితి. ఆ సినిమాలకి సంబంధించిన వాళ్లంతా కూడా టెస్టులు చేయించుకునే పనుల్లో పడ్డారు. విక్రమ్ కరోనాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, అయినా ఆయన ఎలా వైరస్ బారిన పడ్డారో తెలియడం లేదంటూ ఆయన సిబ్బంది అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నారు.