Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్ 169 లో మ‌రో స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   24 April 2022 2:30 AM GMT
ర‌జ‌నీకాంత్ 169 లో మ‌రో స్టార్ హీరో!
X
సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. యువ ట్యాలెంట్ ని ఎంక‌రేజ్ చేయ‌డంలో సూప‌ర్ స్టార్ ముందు ఉంటారాని మ‌రోసారి నిరూపించారు.

ఈ యంగ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించింది మూడు సినిమ‌లే అయినా తొలి రెండు సినిమాల స‌క్సెస్ ని చూసి ర‌జ‌నీ తన 169వ సినిమా ద‌ర్శ‌కుడిగా లాక్ చేసారు. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతుంది.

తాజాగా ఈ సినిమాలో యంగ్ హీరో శివ కార్తికేయ‌న్ కి కూడా తీసుకున్న‌ట్లు స‌మాచారం. శివ‌ కార్తికేయ‌న్-దిలీప్ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన 'డాక్ట‌ర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో శివ కార్తికేయ‌న్ కి ఓ కీల‌క రోల్ ఫార్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తుంది. మ‌రి శివ కార్తికేయ‌న్ ఎవ‌రి కోరిక మేర‌కు ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నార‌న్న‌ది తెలియాల్సిన అంశం. అయితే ఈ ప్రాజెక్ట్ విష‌యంలో మ‌రో అంశం కూడా తెర‌పైకి వ‌స్తోంది.

ఇటీవ‌లే విజ‌య్ క‌థానాయ‌కుడిగా దీలీప్ తెర‌కెక్కించిన 'బీస్ట్' రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. తీవ్ర విమర్శ‌ల్ని ఎదుర్కుంది. దీంతో ర‌జ‌నీ దిలీప్ ప్రాజెక్ట్ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

కానీ తాజా అప్ డేట్ ని బ‌ట్టి చూస్తుంటే అవ‌న్నీ గాలి వార్త‌లుగానే అనిపిస్తుంది. ఒక్క ప్లాప్ తో ద‌ర్శ‌కుడి విజన్ ని అంచ‌నా వేయ‌డం త‌ప్పు. దిలీప్ గ‌త స‌క్సెస్ లు చూసే ర‌జ‌నీ అకాశం ఇచ్చారు. ఇప్పుడు ఒక్క ప‌రాజ‌యంతో ర‌జ‌నీ భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గితే అత‌ని గొప్ప‌త‌నం ఏమంటుంది. ట్యాలెంటెడ్ మేక‌ర్స్ ని ప్రోత్స‌హించ‌డంలో ర‌జ‌నీ ముందుంటారు.

ఇంత‌కు ముందు 'ఖైదీ' సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లోకేష క‌న‌గ‌రాజ్ కి ఇలాగే అవ‌కాశం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ర‌జ‌నీకాంత్ 'అన్నాతై ' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ ఈ సినిమా తెలుగు నాట స‌క్సెస్ కాలేదు. కోలీవుడ్ లో మాత్రం ర‌జ‌నీ ఇమేజ్ తో నెట్టుకొచ్చింది.