Begin typing your search above and press return to search.

మరో స్టార్‌ హీరో పీరియాడిక్‌ మూవీ రాబోతుంది

By:  Tupaki Desk   |   12 March 2021 12:30 PM GMT
మరో స్టార్‌ హీరో పీరియాడిక్‌ మూవీ రాబోతుంది
X
ఈమద్య కాలంలో పీరియాడిక్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఈ భాష ఆభాష అని కాకుండా అన్ని భాషల్లో కూడా పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయి. ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్‌.. ఆదిపురుష్‌ సినిమాలు పీరియాడిక్‌ సినిమాలే అనే విషయం తెల్సిందే. ఇక పవన్‌ హరిహర వీరమల్లు సినిమా కూడా ఛారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్నదే. తమిళంలో కూడా వరుసగా ఛారిత్రాత్మక నేపథ్యంతో సినిమాలు వస్తున్నాయి. తాజాగా స్టార్‌ హీరో సూర్య కూడా ఒక ఛారిత్రాత్మక సినిమాకు సైన్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వసంత బాలన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక ఛారిత్రాత్మక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే కథకు హీరో సూర్య ఓకే చెప్పడంతో స్క్రిప్ట్‌ వర్క్‌ ను పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. మరో వైపు సూర్య ప్రస్తుతం పాండిరాజ్‌ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వెట్రి మారన్‌ మరియు హరిలతో కూడా సినిమాలకు కమిట్‌ అయ్యి ఉన్నాడు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఆ మూడు సినిమాలు పూర్తి అవ్వగా వసంత బాలన్ దర్శకత్వంలో సినిమాను ఆ తర్వత మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు.