Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' నుంచి మరో సాంగ్ రెడీ..!

By:  Tupaki Desk   |   11 March 2021 6:30 AM GMT
టక్ జగదీష్ నుంచి మరో సాంగ్ రెడీ..!
X
నేచుర‌ల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ''టక్ జగదీష్''. ఇందులో రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన టీజర్ మరియు 'ఇంకోసారి' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో నేడు మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం సెకండ్ సాంగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

'టక్ జగదీష్' కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన 'కోలో కోలన్న కోలో' అనే గీతాన్ని మార్చి 13న ఉదయం గం. 10.08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సందర్భంగా వదిలిన అనౌన్సమెంట్ వీడియో అలరిస్తోంది. గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాని అన్నగా జగపతి బాబు.. తండ్రిగా నాజర్ నటిస్తున్నారు. వీటితో పాటు డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.