Begin typing your search above and press return to search.

ఇంకో 'సీటీమార్' ఇవ్వాల్సిందే, డిమాండ్ లో దేవి

By:  Tupaki Desk   |   2 May 2021 6:30 AM GMT
ఇంకో సీటీమార్ ఇవ్వాల్సిందే, డిమాండ్ లో దేవి
X
రికార్డులు కొల్లగొట్టే సంగీతం అందించే సంగీత దర్శకుల్లో టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. క్యాచీ ట్యూన్స్, మాస్ నంబర్స్‌తో ఉర్రూతలూగించే దేవి..ఓ రేంజిలో క్రేజ్ ఉంది.టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న ఈ రాక్‌స్టార్.. తాజాగా బాలీవుడ్ సినిమాకు సాంగ్ కంపోజ్ చేయడం విశేషం. ఆ సాంగ్ సూపర్ హిట్టైంది. బాలీవుడ్ లో దేవిని బిజీ చేస్తోంది.

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ పెట్టిన సీటీమార్‌ పాట హిందీ జనాల్ని ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘డీజే’ కోసం దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన పాట ఇది. తెలుగులో పెద్ద హిట్టైన ఈ పాటని మెచ్చి తన ‘రాధే’ చిత్రంతో మరోసారి వినిపించాలని నిర్ణయించారు సల్మాన్‌ఖాన్‌. ఇప్పటికే ఆ పాట పూర్తి వెర్షన్ విడుదలైంది. అందులో సల్మాన్‌ఖాన్‌ తనదైన శైలిలో స్టెప్పులేశారు. ఈ పాట విడుదల సందర్భంగా సల్మాన్‌... అల్లు అర్జున్‌ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఇలా మొత్తానికి ఈ సినిమా పాట ఓ రేంజిలో హైప్ తెచ్చుకుంది.

దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. దాంతో దేవిని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా రణ్‌వీర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘సర్కస్‌’ లో రెండు పాటలు చేయటానికి దేవికి ఆఫర్ వచ్చింది. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ లో రణ్‌వీర్‌తో కలిసి దీపిక ఆడిపాడనుందని సమాచారం. ఈ సాంగ్ కే దేవి సంగీతం ఇస్తున్నాడంటున్నారు.

షేక్‌ స్పియర్‌ ‘ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రణ్‌వీర్, రోహిత్‌ కలయికలో వచ్చిన ‘సింబా’ మంచి విజయం సాధించింది. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’లోనూ రణ్‌వీర్‌ అతిథి పాత్రలో తళుక్కుమన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది రానుంది. ‘సర్కస్‌’ను త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ముంబయి, ఊటీ, గోవాల్లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.