Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌31 ఇంకో పుకారు.. ఫ్యాన్స్‌ ను తెగ ఊరిస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Jun 2022 7:53 AM GMT
ఎన్టీఆర్‌31 ఇంకో పుకారు.. ఫ్యాన్స్‌ ను తెగ ఊరిస్తున్నారు
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత పాన్ ఇండియా స్టార్‌ గా మారి పోయాడు. హిందీ ప్రేక్షకుల్లో కూడా ఎన్టీఆర్‌ పై ప్రత్యేక ఆసక్తి మరియు అభిమానం కనిపిస్తుంది. ఇక సౌత్‌ లో ఇతర రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఎన్టీఆర్‌ పై ఎప్పటి నుండే అభిమానం ఉంది. కనుక ఇక నుండి ఎన్టీఆర్‌ నుండి రాబోతున్న ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఆయా ఫిల్మ్‌ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌ 30 మూవీ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో తుది మెరుగులు దిద్దుతున్నాడు. ఎన్టీఆర్‌ కూడా ఫ్యామిలీతో వెకేషన్‌ లో ఉన్నాడు. ఎన్టీఆర్‌ 30 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌ మరియు ఎన్టీఆర్‌ ల కాంబో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ఎన్టీఆర్‌ 31 సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను కూడా రివీల్‌ చేయడం జరిగింది. ఎన్టీఆర్‌ 31 సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. హీరోయిన్ గురించి ఇంకా పలు విషయాల గురించి ప్రచారం జరిగింది. తాజాగా సినిమా టైటిల్ గురించిన చర్చ మొదలయ్యింది.

ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇంట్రెస్టింగ్‌ టైటిల్ 'అసురుడు' ను కన్ఫర్మ్‌ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఎన్టీఆర్ ను కాస్త నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో చూపించబోతున్నాడట. కేజీఎఫ్ లో ఎలా అయితే ప్రశాంత్‌ నీల్ ను నెగిటివ్‌ షేడ్స్ లో చూపించాడో అలాగే ఎన్టీఆర్‌31 లో ఎన్టీఆర్‌ ను అలాగే దర్శకుడు చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకే అసురుడు అనే టైటిల్‌ బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఆ విషయంలో మరింత స్పష్టత రావాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరు కూడా వేరు వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ 31 సినిమా కంటే ముందు ప్రభాస్‌ తో సలార్‌ ను ప్రశాంత్‌ నీల్‌ ముగించాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్‌ పూర్తి అయిన సలార్‌ ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ 31 కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యేలా ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట.