Begin typing your search above and press return to search.

'సలార్'లో ప్రభాస్ తో జతకట్టే బ్యూటీ గురించి మరో రూమర్..!

By:  Tupaki Desk   |   23 Jan 2021 2:30 AM GMT
సలార్లో ప్రభాస్ తో జతకట్టే బ్యూటీ గురించి మరో రూమర్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. పాన్ ఇండియా లెవల్ లో రూపొందనున్న ఈ చిత్రంలో ఇతర ఇండస్ట్రీలకి చెందిన ప్రముఖ నటీనటులను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ విషయంలో రోజుకో న్యూస్ వస్తూనే ఉంది.

ముందుగా 'సలార్' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని హీరోయిన్ గా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అలానే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీ అన్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ని తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లను సంప్రదించిన ప్రశాంత్.. చివరకు ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేయాలని ఆలోచిస్తున్నాడట. ఇందుకోసం దర్శకుడు పలువురు మోడల్స్ ని పరిశీలనలోకి తీసుకుంటున్నాడాట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో చాలామంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆడిషన్స్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేశారు. 'సలార్' రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.