Begin typing your search above and press return to search.

మేజర్ ఖాతాలో మరో రికార్డు

By:  Tupaki Desk   |   9 Jun 2022 5:30 AM GMT
మేజర్ ఖాతాలో మరో రికార్డు
X
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు నుంచే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. రోజుకో రికార్డు సొంతం చేసుకున్న ఈ సినిమా అడివి శేష్ మార్కెట్ ను కూడా పెంచుతోంది. ఈ సినిమా కోసం అడవిశేష్ పడిన కష్టం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.

సాధారణంగా సినిమా విడుదల తర్వాత ప్రమోషన్స్ విషయంలో హీరో బాధ్యత తెలుసుకుంటేనే మిగతా వాళ్ళు కూడా ఎంతో స్ఫూర్తి గా ముందుకు సాగుతూ ఉంటారు. ఆ విషయంలో అడవి శేష్ నిజంగానే చాలా బాధ్యతతో ముందుకు నడిచాడు అనే చెప్పాలి.

మేజర్ సినిమాకు ప్రమోషన్ చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతను చేసిన కృషికి సరైన ఫలితం దక్కింది. మేజర్ సినిమాలో కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాకుండా మంచి లవ్ స్టొరీ అలాగే అన్ని రకాల ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉండడంతో బాగా వర్కౌట్ అయింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఎస్ లో అడివి శేష్ సినిమా మొదటిసారి వన్ మిలియన్ డాలర్స్ అందుకోవడం విశేషం. ఇటీవల కాలంలో పాండమిక్ తర్వాత చాలా తక్కువ సినిమాలు యూఎస్ లో వన్ మిలియన్ మార్కును అందుకున్నాయి. ఇక ఇప్పుడు మేజర్ సినిమా ఆ రికార్డును సొంతం చేసుకుంది. యుఎస్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడం విశేషం.

మొత్తానికి అడవి శేష్ ఈ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకున్నాడు. మేజర్ సినిమాను సోని పిక్చర్స్ తో పాటు మహేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా కీలక పాత్ర పోషించడం విశేషం.

ఎక్కడ తగ్గకుండా ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇక సినిమా పెట్టిన పెట్టుబడిని చాలావరకు రికవరీ చేసింది. నిర్మాతలు ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతున్నారు. మరి మొత్తం ఫుల్ రన్ లో సినిమా ఏ మేరకు ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.