Begin typing your search above and press return to search.

మరో రికార్డు బద్దలుకొట్టిన శ్రీమంతుడు!

By:  Tupaki Desk   |   13 April 2020 5:37 PM GMT
మరో రికార్డు బద్దలుకొట్టిన శ్రీమంతుడు!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించిన మహేష్ బాబు తన తర్వాత సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ, ప్రస్తుత సమాచారం ప్రకారం పరశురాం డైరెక్షన్‌లో మహేష్ తన తదుపరి చిత్రం చేయనున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే మహేష్ సినిమా తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అది తాజాగా వచ్చిన చిత్రం కాదు.. 2015లో విడుదలైన సినిమా

మహేష్ బాబు, అందాల భామ శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ శ్రీమంతుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే చాలా రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా యూట్యూబ్ వేదికగా మరో రికార్డును అందుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,080,385 మంది వీక్షించగా, ఇంత వ్యూస్‌ని సంపాదించిన మొదటి తెలుగు మూవీగా శ్రీమంతుడు నిలిచింది. త్వరలోనే 100మిలియన్ల క్లబ్ లో చేరనుంది మహేష్ శ్రీమంతుడు.