Begin typing your search above and press return to search.

తిరిగొచ్చిన ఎన్టీఆర్.. RRR యాక్షన్ స్టార్ట్

By:  Tupaki Desk   |   21 Feb 2019 6:34 AM GMT
తిరిగొచ్చిన ఎన్టీఆర్..  RRR యాక్షన్ స్టార్ట్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్య #RRR షూటింగ్ నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వెకేషన్ తో పాటుగా RRR లో తన పాత్రకు సంబంధించిన కొన్ని కాస్ట్యూమ్స్ కూడా దుబాయ్ లోనే షాపింగ్ చేసినట్టు సమాచారం. దుబాయ్ ట్రిప్ ముగించుకొని రీసెంట్ గా హైదరాబాద్ తిరిగి వచ్చాడట.

ఈరోజునుండి (గురువారం) నుండి ఎన్టీఆర్ మళ్ళీ RRR టీమ్ తో జాయిన్ అయ్యి షూటింగ్ లో పాల్గొంటాడట. ఇదో లాంగ్ షెడ్యూల్ అని.. రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటాడని.. ఈ షెడ్యూల్ లోనే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఎన్టీఆర్ తన లాస్ట్ ఫిలిం 'అరవింద సమేత' లో స్లిమ్ లుక్ లో కనిపించాడు కానీ RRR కోసం కొంత బరువు పెరిగి కొత్త లుక్ లో ఉన్నాడు. మరోవైపు చరణ్ మాత్రం సేమ్ లుక్ కంటిన్యూ చేస్తున్నాడు.

ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు.. హీరోయిన్ల వివరాలపై ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ రాజమౌళి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తారని మాత్రం టాక్ విన్పిస్తోంది. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం 2020 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.