Begin typing your search above and press return to search.

అల ఖాతాలో నెట్‌ ఫ్లిక్స్‌ రికార్డు కూడా

By:  Tupaki Desk   |   11 Dec 2020 9:50 AM IST
అల ఖాతాలో నెట్‌ ఫ్లిక్స్‌ రికార్డు కూడా
X
ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయిన అల వైకుంఠపురంలో సినిమా దక్కించుకున్న రికార్డులను లెక్కించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. పాటల రికార్డు.. వసూళ్ల రికార్డు.. టీఆర్పీ రికార్డు ఇంకా చాలా చాలా ఉన్నాయి. పదుల సంఖ్యలో రికార్డులను దక్కించుకున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ లో ఈ ఏడాది మొత్తంలో అత్యధిక వ్యూస్‌ ను దక్కించుకున్న సౌత్‌ మూవీగా అల వైకుంఠపురంలో నిలిచింది. నెం.1 స్థానంలో అల వైకుంఠపురంలో ఉంది అంటూ స్వయంగా నెట్‌ ఫ్లిక్స్ వారు అధికారికంగా ప్రకటించారు. 2020లో సౌత్‌ ఇండియాలో అత్యధిక వ్యూస్‌ ను ఈ సినిమా దక్కించుకుంది అంటూ వారు ప్రకటించిన నేపథ్యంలో అభిమానుల ఆనందంకు అవదులు లేవు.

థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీలో విడుదల అయినా కూడా అత్యధికంగా వ్యూస్‌ ను దక్కించుకుంది అంటూ నెట్‌ ఫ్లిక్స్‌ పేర్కొంది. అల్లు అర్జున్‌.. పూజా హెగ్డే జంటగా రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించగా థమన్‌ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ జాబితాలో నెం.2గా దుల్కర్‌ సల్మాన్‌ మరియు రీతూ వర్మ నటించిన కనులు కనులను దోచాయంటే సినిమా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా మంచి వ్యూస్‌ ను రాబట్టింది. ఇక మూడవ స్థానంలో కప్పెల అనే మలయాళ సినిమా నిలిచింది. మొత్తానికి నెట్‌ ఫ్లిక్స్‌ లో మన సినిమా దద్దరిల్లినందుకు అభిమానులు మళ్లీ వేడుక చేసుకుంటున్నారు.