Begin typing your search above and press return to search.

పవన్‌ రీ ఎంట్రీ మూవీ గురించి మరో వార్త

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:25 AM GMT
పవన్‌ రీ ఎంట్రీ మూవీ గురించి మరో వార్త
X
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నిక ల్లో సత్తా చూపలేక పోయాడు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుండి బయట పడేందుకు పవన్‌ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు ఓకే చెప్పాడంటూ చాలా రోజులుగా మీడియా లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ హిట్‌ మూవీ 'పింక్‌' రీమేక్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అఫిషియల్‌ గా ప్రకటన రాలేదు. కాని పవన్‌ రీ ఎంట్రీ కన్ఫర్మ్‌ అంటూ అంతా చాలా గట్టిగా చెబుతున్నారు.

పింక్‌ రీమేక్‌ గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త సోషల్‌ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పింక్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలను వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి తర్వాత మొదలు పెట్టేందుకు దిల్‌ రాజు ఏర్పాట్లు చేస్తున్నాడట. మొదట ఒక షెడ్యూల్‌ మొత్తం కూడా పవన్‌ కళ్యాణ్‌ లేకుండానే షూటింగ్‌ చేస్తారట. పవన్‌ లేకుండా ఉండే సీన్స్‌ చిత్రీకరణ అంతా పూర్తి చేసిన తర్వాత అప్పుడు పవన్‌ రంగంలోకి దిగుతాడనే ప్రచారం జరుగుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పవన్‌ ను మళ్లీ వెండి తెరపై చూస్తామా అంటూ వారు అంతా కూడా ఉత్సాహం తో ఉన్నారు. పింక్‌ రీమేక్‌ విషయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు హీరోయిన్‌ ఇతర పాత్రల విషయం లో కూడా క్లారిటీ రాలేదు. దిల్‌ రాజు నిర్మించబోతున్నాడు.. లీడ్‌ రోల్‌ లో పవన్‌ కళ్యాణ్‌ నటించ బోతున్నాడు. ఈ రెండు తప్ప రీమేక్‌ కు సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు.