Begin typing your search above and press return to search.

'సర్కారు వారి..' ఫస్ట్ నోటీస్ తో మహేష్ పేరిట మరో సరికొత్త రికార్డ్..!

By:  Tupaki Desk   |   2 Aug 2021 11:32 AM GMT
సర్కారు వారి.. ఫస్ట్ నోటీస్ తో మహేష్ పేరిట మరో సరికొత్త రికార్డ్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్.. జూలై 31న 'సర్కారు వారి2..' ఫస్ట్ నోటీస్ ను విడుదల చేశారు. మహేష్ ఓ కారులో నుంచి కాలు బయట పెడుతున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇందులో మహేష్ హెయిర్ స్టైల్ - లుక్ కి సినీ అభిమానులు ఫిదా అయ్యారు.

అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన తెచ్చుకున్న.'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్.. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 24 గంటల్లోనే 95.6K లైక్స్ మరియు 49.1K రీట్వీట్‌ లను సంపాదించడం ద్వారా విడుదలైన మొదటి 24 గంటల్లో టాలీవుడ్ లో మోస్ట్ లైక్డ్ అండ్ రీట్వీట్ చేయబడిన పోస్టర్‌ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా పోస్టర్ మరో రికార్డు సృష్టించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన పోస్టర్ గా 'సర్కారు వారి..' ఫస్ట్ నోటీస్ రికార్డ్ క్రియేట్ చేసింది. కామెంట్స్ విషయంలో కూడా ఈ పోస్టర్ అరుదైన రికార్డ్ నెలకొల్పిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మహేష్ బాబు బర్త్‌ డే స్పెషల్‌ గా ఆగస్టు 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ 'సూపర్‌ స్టార్ బర్త్‌ డే బ్లాస్టర్' పై అందరి దృష్టి పడింది.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకు జోడిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.