Begin typing your search above and press return to search.
రేణు దేశాయ్ ఫ్యామిలీలోకి మరో కొత్త అతిథి..!
By: Tupaki Desk | 25 Dec 2020 11:00 PM ISTసినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. నటిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా దర్శకురాలిగా నిరూపించుకుంది రేణు. నటనకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్య ల గురించి కూడా వెల్లడిస్తూ ఉంటుంది. ఇక రేణు దేశాయ్ కి పిల్లుల అంటే ఎంతో ఇష్టమనే విషయం ఆమెను ఫాలో అయ్యేవారికి కచ్చితంగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న ఫీబీ, ఫీడీ అనే రెండు పిల్లుల గురించి చెబుతూ పలుమార్లు వీడియోలను షేర్ చేసింది. తాజాగా రేణూ దేశాయ్ కొత్తగా వచ్చిన మరో పిల్లి గురించి చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం ఉన్న రెండు పిల్లులకు తోడుగా బర్త్ డే గిఫ్ట్ గా కొత్త క్యాట్ ఇంట్లోకి వచ్చిందని రేణూ దేశాయ్ తెలిపింది. పిల్లులను బయట షాపుల్లో కొనొద్దని.. ఎవరి దగ్గరి నుంచైనా దత్తత చేసుకోండని రేణూ దేశాయ్ సూచించింది. అలానే ఇంట్లోకి కొత్తగా వచ్చిన పిల్లికి ఏదైనా పేరు సూచించమని.. అది కూడా ఎఫ్ అక్షరంతో ఫీబీ, ఫీడీలతో కలిసి వచ్చేలా ఉండాలని నెటిజన్స్ ని కోరింది. ఇంకా వాటి గురించి చెబుతూ ఫీబో నా ఒళ్ళో పడుకుంటే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పిల్లి నా భుజంపైన పడుకుంటోందంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక రేణు కెరీర్ విషయానికొస్తే ఆమె మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. ''ఆద్య'' అనే పవర్ ఫుల్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. రాత్రి పగలు అని తేడా లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తూ బిజీగా గడుపుతోంది.