Begin typing your search above and press return to search.
మరో మెగా పాన్ ఇండియా మూవీ?
By: Tupaki Desk | 29 Aug 2021 1:06 PM ISTమెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా తో పాన్ ఇండియా స్టార్స్ గా మారబోతున్నారు. పాన్ ఇండియా మూవీస్ గా ఈమద్య కాలంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు రూపొందుతున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ప్రభాస్ దారిలో పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు దక్కించుకునేందుకు పలువురు యంగ్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జాబితాలో మరో మెగా హీరో జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ మీడియా సర్కిల్స్ ద్వారా సమాచారం అందుతోంది.
టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చే ఏడాది ఒక భారీ పాన్ ఇండియా మూవీతో రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎఫ్ 3 మరియు గని సినిమా లు చేస్తున్న వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమా ల తర్వాత పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాక్స్ జరుగుతున్నాయట. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న నాగార్జున మూవీ ది ఘోస్ట్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో సినిమాను చేసేందుకు ఒక భారీ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట.
విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న ప్రవీణ్ సత్తారు విభిన్నమైన కాన్సెప్ట్ తో సినిమాను చేస్తాడనే విషయం తెల్సిందే. అందుకే ఆయన దర్శకత్వంలో చేసేందుకు వరుణ్ తేజ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. వరుణ్ తేజ్ చేయబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను ఎలా రూపొందిస్తాడు అనేది చూడాలి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే చివరి వరకు షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మెగా పాన్ ఇండియా మూవీస్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుణ్ తేజ్ కు మంచి క్రేజీ పాన్ ఇండియా సినిమాను ప్రవీణ్ సత్తారు ఇవ్వగలడా అనేది చూడాలి.