Begin typing your search above and press return to search.

బన్నీ వదిలేసిన ఆ రీమేక్‌ లో మరో మెగా హీరో!

By:  Tupaki Desk   |   13 Feb 2020 9:42 AM IST
బన్నీ వదిలేసిన ఆ రీమేక్‌ లో మరో మెగా హీరో!
X
అల్లు అర్జున్‌ ‘నాపేరు సూర్య’ చిత్రం తర్వాత పలువురు దర్శకులతో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని చివరకు త్రివిక్రమ్‌ తో బన్నీ సినిమా సెట్‌ అయ్యింది. వీరిద్దరి సినిమా కన్ఫర్మ్‌ అయిన సమయంలో హిందీ హిట్‌ మూవీ సోనూకి టీటూ కే స్వీటీ ని రీమేక్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. బన్నీకి సన్నిహితంగా ఒక పీఆర్‌ ఆ విషయాన్ని స్వయంగా మీడియాకు తెలియజేశాడు. అధికారిక ప్రకటన అనుకుంటున్న సమయంలో ఆ రీమేక్‌ బన్నీకి వర్కౌట్‌ అవ్వదని భావించి వదిలేశారు.

ఆ రీమేక్‌ ను వదిలేసి అల వైకుంఠపురంలో చిత్రం కథను దర్శకుడు త్రివిక్రమ్‌ పట్టాలెక్కించాడు. అల వైకుంఠపురంలో చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. బన్నీ కెరీర్‌ లోనే కాకుండా టాలీవుడ్‌ లోనే టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. దాంతో ఆ రీమేక్‌ ను పక్కకు పెట్టి మంచి పని చేశారంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సోనూ కి టీటూ కే స్వీటీ సినిమా రీమేక్‌ చేసేందుకు భారీ మొత్తంను పెట్టి కొనుగోలు చేశారు. కనుక దాన్ని వదిలేయకూడదని నిర్మాతలు భావిస్తున్నారు.

ఆ రీమేక్‌ రైట్స్‌ వృదా కానియ్యకుండా ప్రస్తుతం ఒక మెగా హీరోతో ఆ రీమేక్‌ ను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మెగా హీరో సినిమా చూశాడని.. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు ప్రాజెక్ట్‌ లు పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ ను చేసేందుకు ఒప్పుకున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రీమేక్‌ పట్టాలెక్కాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అప్పటి వరకు మళ్లీ ఆలోచన మారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రీమేక్‌ సెట్స్‌ పైకి వెళ్లే వరకు నమ్మకం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.