Begin typing your search above and press return to search.

మరోటి వదిలిన 'డేగల బాబ్జీ'

By:  Tupaki Desk   |   10 Oct 2021 9:30 AM GMT
మరోటి వదిలిన డేగల బాబ్జీ
X
నటుడిగా సుపరిచితుడు అయిన బండ్ల గణేష్ నిర్మాతగా పెద్ద సినిమాలను నిర్మించి బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్‌ అనే పేరును దక్కించుకున్నాడు. ఈమద్య కాలంలో బండ్ల గణేష్‌ సినిమాల నిర్మాణం వైపు కొన్ని కారణాల వల్ల మొగ్గు చూపడం లేదు. ఈ సమయంలో ఆయన నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. బండ్ల గణేష్‌ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ను మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో మొదలు పెట్టాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బండ్ల గణేష్ హీరోగా నటించేసేందుకు సిద్దం అయ్యాడు. తమిళ మూవీ ఒత్త సెరప్పు అళవు 7 రీమేక్ లో నటించేందుకు సిద్దం అయ్యాడు. జాతీయ అవార్డును దక్కించుకున్న ఆ సినిమా ను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

డేగల బాబ్జీ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ను ఇప్పటికే రివీల్‌ చేయడం జరిగింది. ఫస్ట్‌ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరుసగా సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను రివీల్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికర పోస్టర్‌ ను బండ్ల గణేష్‌ ట్వీట్ చేశాడు. సినిమా శరవేగంగా చిత్రీకరన జరుపుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలలోనే సినిమా ను ముగించేయాలనే పట్టుదలతో యూనిట్‌ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. వెంకట్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు.

బండ్ల గణేష్ నటుడిగా ఈ సినిమాలో తనను తాను నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎమోషన్స్ పండించే మంచి పాత్ర అని.. బండ్ల గణేష్‌ ఆ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. బండ్ల గణేష్ డేగల బాబ్జీ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎంతో మంది పెద్దగా గుర్తింపు లేని వారు.. ప్రతిభ లేని వారు సినిమాల్లో హీరోలుగా నటిస్తుంటే బండ్ల గణేష్ వంటి మంచి నటుడు హీరోగా ఎందుకు నటించకూడదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేష్ కు ఉన్న ప్రతిభ కారణంగా ఆయన వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న డేగల బాబ్జీ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్ల ద్వారా విడుదల చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. హిందీలో అమితాబచ్చన్ ప్రథాన పాత్రలో ఈ రీమేక్ రూపొందుతోంది. తెలుగు లో బండ్ల గణేష్‌ రీమేక్ చేస్తున్నాడు.