Begin typing your search above and press return to search.

'సలార్‌' కోసం మరో కేజీఎఫ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   15 March 2021 3:40 AM GMT
సలార్‌ కోసం మరో కేజీఎఫ్‌ స్టార్‌
X
బాహుబలి స్టార్ ప్రభాస్‌.. కేజీఎఫ్‌ స్టార్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో రూపొందుతున్న సలార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేజీఎఫ్ ను మించి యాక్షన్‌ సన్నివేశాలను సలార్ లో చూపించబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు. సలార్‌ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్‌ ను కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు మరింతగా మస్‌ మసాలా ఎలిమెంట్స్ ను జోడించడం కోసం అన్నట్లుగా సలార్‌ లో క్రేజీ బ్యూటీతో ఐటెం సాంగ్ ను చేయించేందుకు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా కోసం కేజీఎఫ్ హీరోయిన్‌ శ్రీనిధి శెట్టిని ఐటెం గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. కేజీఎఫ్‌ కు వర్క్‌ చేసిన ఎంతో మంది సలార్ కోసం కూడా వర్క్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో సలార్ రేంజ్ ను మరింతగా పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో సలార్‌ లో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న సలార్ ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.