Begin typing your search above and press return to search.

మ‌రోసారి స‌మంత ఊ అంటావా అంటూ ఊపేయ‌నుందా?

By:  Tupaki Desk   |   18 July 2022 4:20 AM GMT
మ‌రోసారి స‌మంత ఊ అంటావా అంటూ ఊపేయ‌నుందా?
X
అందాల ముద్దుగుమ్మ స‌మంత పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనే కాకుండా ఓవైపు వెబ్ సిరీసులు, మ‌రోవైపు హాలీవుడ్ సినిమాల దాకా ఈ భామ‌ ప్ర‌స్థానం కొన‌సాగుతోంది. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన పుష్ప చిత్రంతో స‌మంత క్రేజ్ ప్ర‌పంచ స్థాయికి చేరిందంటే అతిశ‌యోక్తి కాదు.

అందులో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా ఐటెమ్ సాంగులో స‌మంత రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఆమె మాసీ లుక్కు, డ్యాన్స్ స్టెప్పులు పిల్లా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రినీ ఒక ఊపు ఊపాయి. సామ్ తన కెరీర్‌లో చేసిన సినిమాలన్నీ ఒకఎత్తు అయితే.. ఈ ఒక్క పాట మరో ఎత్తు.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి స‌మంత ఐటెమ్ సాంగులో దుమ్ములేప‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత చేతిలో తెలుగులో మూడు చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఇక ప్ర‌ముఖ నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న య‌శోద చిత్రంలోనూ స‌మంత హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌స్తున్న ఖుషీ చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్.

కాగా పుష్ప‌లో ఐటెమ్ సాంగులో క‌నిపించి పిచ్చెక్కించిన స‌మంత మ‌రోమారు య‌శోద సినిమాలో ఐటెమ్ సాంగులో దుమ్ము లేప‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌స్తున్న‌యశోదకు హ‌రి, హ‌రీష్ అనే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల కాబోతోంది. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కనున్న ఈ సినిమాలో స‌మంత ఒక ఐటెమ్ సాంగు చేయ‌బోతుంద‌నే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందుకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన ఓ స్పెషల్ సెట్‌లో జరుగుతోందని, మణిశర్మ సూపర్ మ్యూజిక్ అందించారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతేకాదు ఈ పాట 'ఊ అంటావా'కు మించిన విధంగా ఉండనుందని చెబుతున్నారు. ఇక ఆ సినిమా విడుద‌ల‌య్యాక ఇంకెంత సంచ‌ల‌నం సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే..