Begin typing your search above and press return to search.

ఈ ఏడాది నెంబర్ 1 సాంగ్ బన్నీదే!

By:  Tupaki Desk   |   17 Dec 2020 12:30 PM IST
ఈ ఏడాది నెంబర్ 1 సాంగ్ బన్నీదే!
X
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా కూడా ఇదే. ఈ చిత్ర విజయంలో పాటలదే మెజారిటీ షేర్ అంటే అతిశయోక్తి కాదు. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే రిలీజైన పాటలు.. శ్రోతలను మైమరపింపజేశాయి. ఈ మూవీలోని ప్రతీ పాాట కూడా అలరించింది. థియేటర్లలో కూడా ఈ పాటలను ప్రేక్షకులు మస్తుగా ఏంజాయ్ చేశారు. ఈ పాటల కోసమే రెండు మూడుసార్లు సినిమాను చూసిన వారు కూడా ఉన్నారు.

వీటిల్లో ముఖ్యంగా అర్మాన్ మాలిక్ ఆలపించిన ‘బుట్టబొమ్మ’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట.. చిన్నాపెద్దా తేడా లేకుండా.. మాస్, క్లాస్ అనే బేధం లేకుండా.. అన్ని వర్గాల వారినీ అలరించింది. ఇందుకు సాక్ష్యం కాావాలంటే.. యూట్యూబ్, అమెజాన్ మ్యూజిక్ లెక్కలు చూడొచ్చు. అమెజాన్ మ్యూజిక్ లో 2020 ఏడాదిలో వచ్చిన ఉత్తమమైన తెలుగు పాటల్లో మొదటి స్థానంలో నిలిచింది బుట్ట బొమ్మ సాంగ్. ఇక, ఇండియావైడ్ గా వీక్షకులను ఆకట్టుకున్న టాప్-10 యూట్యూబ్ పాటల్లో ‘బుట్ట బొమ్మ’పాట 3వ స్థానంలో నిలవగా.. ‘రాములో రాముల’ సాంగ్ 8వ స్థానం దక్కించుకుంది. థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాటలు.. ఇప్పటికీ జనాలను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.