Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ హీరో కెరీర్ లో మరో హిట్ పడినట్లేనా..

By:  Tupaki Desk   |   10 March 2021 2:30 PM GMT
టాలెంటెడ్ హీరో కెరీర్ లో మరో హిట్ పడినట్లేనా..
X
టాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలలో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభంలో చిన్న క్యారెక్టర్స్ లో మెప్పించిన శ్రీవిష్ణు.. హీరోగా మారి వరుస విజయాలు అందుకుంటున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా స్టోరీకి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటున్న విష్ణు.. 'అప్పట్లో ఒకడుండేవాడు' 'మెంటల్ మదిలో' 'నీది నాదీ ఒకే కథ' 'బ్రోచేవారెవరురా' వంటి సినిమాలతో మంచి విజయాలు నమోదు చేశాడు. ఈ క్రమంలో టాలెంటెడ్ హీరో నటించిన ''గాలి సంపత్'' సినిమా శివరాత్రి సందర్భంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే - దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది - ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీ విష్ణుతో పాటు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. శ్రీవిష్ణు సరసన ల‌వ్‌ లీ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కామెడీతో పాటు తండ్రీకొడుకుల ఎమోషనన్స్ కలబోసిన 'గాలి సంపత్' సినిమాలో శ్రీవిష్ణు, సహజమైన నటనతో మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నాడని ట్రైలర్ లోనే తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటుడితో పోటీపడి మరీ నటించడానికి చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి వర్సటైల్ హీరో శ్రీవిష్ణు కు 'గాలి సంపత్' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.