Begin typing your search above and press return to search.

మరో హీరోయిన్‌ పెళ్లి పీఠలు ఎక్కింది

By:  Tupaki Desk   |   22 Nov 2020 2:40 PM IST
మరో హీరోయిన్‌ పెళ్లి పీఠలు ఎక్కింది
X
ఇటీవలే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌ తన ఆనందకరమైన జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. కాజల్‌ పెళ్లి వార్తలు జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సమయంలో మరో హీరోయిన్‌ పెళ్లి చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు మిస్టర్‌ నూకయ్య.. కత్తి మరియు గగనం సినిమాలతో హీరోయిన్‌ గా పరిచయం అయ్యిన సన ఖాన్‌ పెళ్లి పీఠలు ఎక్కింది. సౌత్‌ లో పలు సినిమాల్లో నటించిన ఈమెకు స్టార్‌ డం దక్కలేదు. అయినా కూడా ప్రయత్నాలు మానలేదు.

బాలీవుడ్‌ లో కూడా పలు సినిమాల్లో నటించింది. అక్కడ కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో పెళ్లికి సిద్దం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమె 2019 ఫిబ్రవరిలో మెల్విన్‌ అనే కొరియోగ్రాఫర్‌ తో రిలేషన్‌ లో ఉన్నట్లుగా ప్రకటించింది. కాని ఏం జరిగిందో ఏమో కాన 2020 ఆరంభంలో అడి నుండి బ్రేకప్‌ అయ్యింది. ఆ విషయాన్ని ఇద్దరు కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ పోస్ట్‌ లు పెట్టారు.

బ్రేకప్‌ అయిన కొన్నాళ్లకే గుజరాతీ వ్యాపారవేత్త అయిన ముఫ్తీ అన్నాస్‌ తో పరిచయం అయ్యింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిన్న వీరి వివాహం సూరత్‌ లో జరిగింది. కరోనా కారణంగా కొద్ది మంది బంధు మిత్రుల సమక్షలో వీరి వివాహం జరిగింది. గుజరాతీలో ఇకపై సనాఖాన్‌ సెటిల్‌ అవ్వబోతుంది. ఇకపై సినిమాల్లో నటించడం అనుమానమే అన్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.