Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' రిలీజ్ పై మ‌రో డౌట్?

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:33 AM GMT
భీమ్లా నాయక్ రిలీజ్ పై మ‌రో డౌట్?
X
2020-21 సీజ‌న్ సినిమాల‌కు ఎంత గంద‌ర‌గోళం సృష్టించిందో తెలిసిందే. ఇప్ప‌టికీ ఈ గంద‌ర‌గోళం వైదొల‌గ‌లేదు. 2022 సంక్రాంతి బ‌రిలో రావాల్సిన చాలా పెద్ద సినిమాల విడుద‌ల‌లు వాయిదా ప‌డ్డాయి. ఒక‌రికోసం ఒక‌రు త్యాగాలు చేయడంతో ప‌వ‌న్ .. మ‌హేష్ లాంటి స్టార్లు సైతం ఇరుకున ప‌డ్డారు. స‌ద‌రు హీరోలు న‌టించిన సినిమాలేవీ ఇప్ప‌ట్లో రిలీజ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ వాయిదాతో రిలీజ్ లు అన్ని మ‌ళ్లీ గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. జ‌న‌వ‌రి 12` భీమ్లా నాయ‌క్` ని విడుద‌ల చేయాల్సి ఉండ‌గా చివ‌రికి వాయిదా వేసుకున్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ భీమ్లా నాయ‌క్ ని ఫిబ్ర‌వ‌రి 25న‌ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. కానీ ఇప్పుడు ఆ తేదీన కూడా వ‌స్తుందా రాదా? అన్న సందేహం క‌లుగుతోంది.

అందుకు కార‌ణం అదే తేదీకి శ‌ర్వానంద్ న‌టించిన ఆడాళ్లు మీకు జోహార్లు విడుద‌ల‌వుతుండ‌డ‌మే. నిజానికి ఒక అగ్ర హీరో సినిమాకి పోటీగా శ‌ర్వా విడుద‌ల‌ను ఆశించ‌డు. అది అంత మంచిది కాదు కూడా. కానీ డౌట్ లేకుండా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించేశారంటే.. ఆరోజు ప‌వ‌ర్ స్టార్ సినిమా విడుద‌ల కావ‌డం లేద‌నే భావించేందుకు ఆస్కారం క‌ల్పిస్తోంది. భీమ్లా నాయ‌క్ మ‌రో కొత్త తేదీపై దృష్టి సారిస్తున్నాడ‌ని సందేహాల్ని క‌లిగిస్తోంది. అయితే దీనిపై సితార వాళ్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు ఇంకా స‌మ‌యం ప‌ట్ట‌నుంద‌ని స‌మాచారం. ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు.