Begin typing your search above and press return to search.

కరోనా వల్ల కొట్టుకు పోయిన మరో క్రేజీ ప్రాజెక్ట్‌

By:  Tupaki Desk   |   8 Nov 2020 3:44 PM IST
కరోనా వల్ల కొట్టుకు పోయిన మరో క్రేజీ ప్రాజెక్ట్‌
X
ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. అనేక రంగాలు కుదేళయ్యాయి. కొన్ని లక్షల కుటుంబాలు కష్టాల్లోకి నెట్టబడ్డాయి. పరిస్థితులు మెల్లగా కుదుట పడుతున్న ఈ సమయంలో గతం తాలూకు విషాదాలు కనిపిస్తూ వస్తున్నాయి. సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ ఏడాది కరోనా వల్ల జీరో ఇయర్‌ గా మిగిలే పరిస్థితి వచ్చింది. కరోనా లాక్‌ డౌన్‌ కు ముందు ప్రారంభించబడ్డ సినిమాలు అనౌన్స్‌ చేయబడ్డ సినిమాలు చాలా వరకు క్యాన్సిల్‌ అయ్యాయి. కొన్ని ప్లానింగ్‌ మార్చుకుని బడ్జెట్‌ తగ్గించుకుని ప్రారంభంకు సిద్దం అవుతున్నాయి. చాలా సినిమాలు పునః ప్రారంభం అయ్యాయి కాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చిన 'మిడ్‌ నైట్‌ రన్నర్స్‌' గురించిన ప్రస్థావనే లేదు.

సౌత్‌ కొరియన్‌ మూవీ అయిన మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ సినిమాను సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రెజీనా మరియు నివేదా థామస్‌ లు హీరోయిన్స్‌ గా రీమేక్‌ చేసేందుకు సురేష్‌ బాబు ఏర్పాట్లు చేశారు. షూటింగ్‌ ఇంకా ప్రారంభం కానప్పటికి స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యంది. అలాగే సినిమా కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు కఠినమైన యాక్షన్‌ సన్నివేశాలకు ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. వీరిద్దరు పోలీస్‌ లుగా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

సినిమా మరికొన్ని రోజుల్లో మొదలు అయ్యే అవకాశం ఉందనుకుంటు ఉండగా కరోనా లాక్‌ డౌన్‌ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్‌ ను ఇవ్వడం లేదు. అసలు సినిమా ఉందా అనే అనుమానం కలిగించేలా నిర్మాణ సంస్థ.. దర్శకుడు.. ఇద్దరు హీరోయిన్స్‌ కూడా వారి వారి ఇతర ప్రాజెక్ట్‌ లపై శ్రద్ద పెట్టి సీరియస్‌ గా వర్క్‌ లో మునిగి పోయి ఉన్నారు. వచ్చే ఏడాదిలో అయిన ఈ రీమేక్‌ చర్చల్లోకి వస్తుందో చూడాలి.