Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్‌ హత్యకు మరో కుట్ర.. వెల్లడయిన సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   8 Oct 2022 10:30 AM GMT
సల్మాన్ ఖాన్‌ హత్యకు మరో కుట్ర.. వెల్లడయిన సంచలన నిజాలు
X
గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్ ఖాన్ ను హత్య చేయబోతున్నట్లుగా బెదిరింపులు వస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా సల్మాన్ ఖాన్‌ హత్య కోసం రెక్కీ నిర్వహించడంతో పాటు.. చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వెల్లడి అయ్యింది. దాంతో సల్మాన్‌ ఖాన్ హత్య కు కుట్ర సంబంధించిన విషయాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

సల్మాన్ ఖాన్‌ హత్యకు తాము ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసుల కస్టడీలో ఉన్న ఆర్ పీ జీ దాడి నిందితులు తెలియజేశారు. మే 9వ తారీకున మొహాలీలోని పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ పై జరిగిన ఆర్ పీ జీ దాడి లో ఒక మైనర్ తో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో షూటర్ హర్షద్ తో పాటు ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లుగా పోలీసులు ఆ సమయంలో తెలియజేశారు.

గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ నుండి ఆర్ పీ జీ కేసులో అరెస్ట్‌ అయిన మైనర్ బాలుడికి సల్మాన్ ఖాన్‌ ను హత్య చేసేందుకు టాస్క్ అప్పగించడం జరిగిందట.

ఆ మైనర్ బాలుడు ఇప్పడు అదే పనిలో ఉన్నాడని.. ఇప్పటికే ఆ బాలుడు మరో వ్యక్తికి సల్మాన్ ఖాన్‌ ను హత్య చేసేందుకు టాస్క్ ఇవ్వడం జరిగిందని పోలీసుల ఎంక్వౌరీలో వెళ్లడయ్యింది.

సల్మాన్‌ ఖాన్‌ ను హత్య చేసేందుకు ఎందుకు ఇంతగా ప్రయత్నిస్తున్నారు.. సల్మాన్ ను మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు ఎందుకు ఇంతగా కుట్ర చేస్తున్నారు అనే విషయమై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే సల్మాన్‌ ఖాన్‌ యొక్క భద్రత ఇప్పటికే ఉన్న దాని కంటే కూడా రెట్టింపు చేసినట్లుగా ముంబై పోలీసు అధికారులు తెలియజేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.