Begin typing your search above and press return to search.

ధ‌నుష్‌- అనిరుధ్ మ‌రో చార్ట్ బ‌స్ట‌ర్

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:36 AM GMT
ధ‌నుష్‌- అనిరుధ్ మ‌రో చార్ట్ బ‌స్ట‌ర్
X
త‌మిళ్ హీరో ధ‌నుష్ ఇత‌ర‌ హీరో ల కంటే కాస్త భిన్నంగానే ఆలోచిస్తున్నాడు. క‌థ‌ల ఎంపిక‌.. క‌థానాయిక‌ల ఎంపిక‌.. మ్యూజిక్ టేస్ట్ ప‌రంగా అత‌డు అంద‌రి కంటే ఒక‌డుగు ముందే ఉంటున్నాడు. అప్ప‌ట్లో అనిరుధ్ తో క‌లిసి కొల‌వెరిడి అంటూ సంచ‌ల‌నానికి తెర తీశాడు. ఆ ఒక్క పాట‌ తో ఆ ద్వ‌యం బోలెడంత పాపులారిటీ సంపాదించారు.

ప్ర‌స్తుతం మ‌రోసారి అలాంటి మ్యాజిక్ చేసేందుకు అనిరుధ్ తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు ధ‌నుష్‌. ఈసారి కూడా అలాంటి క్రేజీ సాంగ్ ని క్రియేట్ చేసింది ఈ బృందం. థ‌నుష్ క‌థా నాయ‌కుడి గా న‌టిస్తున్న తాజా చిత్రం ప‌టాస్ కి అనిరుధ్ ఇచ్చిన ట్యూన్స్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇప్ప‌టి కే విడుద‌లైన రెండు పాట‌ల‌ కు శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా సినిమా లోని జికిడి కిలాడీ అనే సాంగ్ ను రిలీజ్ చేసారు. కొల‌వెరిడీ కుర్రాడు అనిరుధ్‌-ధ‌నుష్ క‌ల‌సి పాడ‌టం తో సోష‌ల్ మీడియాలో ఈ సాంగ్ జోరుగా వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌లో ద‌మ్ముంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఇంత‌కు ముందు ధ‌నుష్ - మెహ్రీన్ జంట రొమాన్స్ కి సంబంధించిన పాట‌ను రిలీజ్ చేస్తే దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఒక ర‌కంగా ధ‌నుష్‌- అనిరుధ్ జోడీ సుకుమార్ - దేవీశ్రీ‌ లా బాగా కుదిరార‌న్న టాక్ వినిపిస్తోంది. ఇక ప‌టాస్ చిత్రం జన‌వ‌రి 16న రిలీజ‌వుతోంది. ఇందు లో 38ఏళ్ల స్నేహ వేశ్య పాత్ర‌ లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తి ని రేకెత్తిస్తోంది.