Begin typing your search above and press return to search.
మోనాల్ కు 'మా' డాన్స్+ తో మరో ఛాన్స్
By: Tupaki Desk | 26 Dec 2020 1:45 PM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నిర్వాహకులు మోనాల్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియదు కాని ఆమె 14వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి కారణం ఖచ్చితంగా బిబి నిర్వాహకులే అంటూ చాలా మంది ట్రోల్ చేశారు. ఎవరు ఎన్ని అన్నా కూడా వాటిని పట్టించుకోకుండా నిర్వాహకులు బలమైన కంటెస్టెంట్స్ ను బయటకు తీసుకు వచ్చి మోనాల్ ను మాత్రం అక్కడే ఉంచారంటూ కొందరి ఆరోపణ. ఆ విషయం పక్కన పెడితే స్టార్ మా వారు ఇప్పుడు మోనాల్ కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్టార్ మా లో ఓంకార్ చేయబోతున్న డాన్స్+ షో లో మోనాల్ కనిపించబోతుంది.
ఇప్పటికే ఈ విషయమై స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. రేపటి నుండి ప్రారంభం కాబోతున్న డాన్స్+ షో లో మోనాల్ సందడి ఉంటుందని ప్రోమోలోనే చూపించారు. ప్రోమో లో మోనాల్ ను చూస్తుంటే జడ్జ్ గా కంటే యాంకర్ గా కనిపించబోతుందా అనిపిస్తుంది. కాని ఇది ఓంకార్ డాన్స్ షో కనుక ఆయనే హోస్టింగ్ చేస్తాడు. మోనాల్ ను జడ్జ్ గా కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఆమె అమ్మ రాజశేఖర్ లేదా బాబా మాస్టర్ లతో కలిసి జడ్జట్ మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రేపు షో తో గెస్ట్ ఎవరు జడ్జ్ ఎవరు అనే విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మోనాల్ కు మాత్రం ఇది మరో మంచి ఛాన్స్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.