Begin typing your search above and press return to search.

ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   1 May 2021 1:18 PM IST
ప్రభాస్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రాధేశ్యామ్ లాంటి క్లాస్ లవ్ స్టోరీ తర్వాత వరుసగా మాస్సివ్ సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు రెండు సినిమాలను బాలన్స్ చేస్తూ షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ప్రభాస్ 'సలార్' అనే సాలిడ్ మాస్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. సలార్ తో పాటుగా ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా చేస్తున్నాడు. రామాయణం నేపథ్యంలో పౌరాణిక చిత్రంగా ఆదిపురుష్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతిసనన్ నటిస్తోంది.

వీటితో పాటు ప్రభాస్ ఆల్రెడీ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ సినిమాను ఓకే చేసాడు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది దసరా సందర్బంగా నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. పాన్ వరల్డ్ సినిమాగా నాగ్ అశ్విన్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలతో పాటు ప్రభాస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీస్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సాలిడ్ యాక్షన్ మూవీ ప్లాన్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ గా బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ నటించనున్నట్లు టాక్. ఇప్పటికి సాహో సినిమా నుండి ప్రభాస్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ - సిద్ధార్థ్ సినిమాలో కత్రినా అంటే చూడాలి మరి ఈ పెయిర్ ఎలా ఉండబోతుందో..!