Begin typing your search above and press return to search.
అనుష్క డైరెక్టర్ కు మరో బాలీవుడ్ ఆఫర్!
By: Tupaki Desk | 22 Oct 2020 9:00 AM ISTఅనుష్క నటించిన థ్రిల్లర్ ఎంటర్ టైనర్ `భాగమతి`. 2018 జనవరి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి సోలోగా అనుష్క మార్కెట్ స్థాయిని మరోసారి బయటపెట్టింది. దాదాపు 60 కోట్లకు పైనే బాక్సాఫీస్ వద్ద వసూళ్లని సాధించిన ఈ చిత్రాన్ని`పిల్లజమీందార్` ఫేమ్ దర్శకుడు అశోక్ తెరకెక్కించారు. ప్రస్తుతం ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ మూవీతో అశోక్ బాలీవుడ్‌కు వెళుతున్న విషయం తెలిసిందే. భూమి పడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తోంది. `దుర్గావతి` పేరుతో రీమేక్ చేస్తున్నారు. విక్రమ్ మల్హోత్రా, భూషన్ కుమార్..., హీరో అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 30న ఈ చిత్రాన్ని ప్రకటించారు. జనవరి 30న మధ్యప్రదేశ్ లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అర్షద్‌వర్షీ.. , మహీగిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డిసెంబర్ 11న ఈ ,చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కాకుండానే దర్శకుడు అశోక్ బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ ని పట్టేశాడు. థ్రిల్లర్ జొనర్‌లోనే రూపొందనున్న ఈ చిత్రాన్ని `పుష్పక విమానం` తరహాలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా రూపొందించబోతున్నాడట. `ఉఫ్` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో నుస్రత్ బారుచా...., నోరా ఫతే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు లవ్ రంజన్ జనవరి నుంచి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.